సీతం గర్ల్స్ హాస్టల్‌లో వసంత పంచమి వేడుకలు
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్థానిక సీతం ఇంజనీరింగ్ కళాశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని 200 మంది విద్యార్థినులు పూజాకార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామమూర్తి పాల్గొని విద్యార్థులకు వసంత పంచమి విశిష్ఠతను వివరిస్తూ, వసంతం అంటే అందరికీ ఎనలేని ఆనందాన్ని ఇచ్చేదని, ఇదే రోజున పవిత్రమైన గ్రంథాలను సరస్వతీ దేవి విగ్రహం దగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారని, వసంత పంచమి రోజున సరస్వతీ దేవి జన్మించిందని తెలిపారు. అందుకే ఈరోజున సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం పొందొచ్చని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ శశిభూషణ్ రావు మాట్లాడుతూ, ప్రస్తుత నేపథ్యం లో నైతిక విలువలు మరుగున పడిపోతున్నాయని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం వుందని, ప్రేమ పేరుతో యువతి యువకులు తప్పు దారిన పడుతున్నారని, వారు దీనిని అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి వారి సహాయ పహారాలతో వారి జీవితానికి లక్ష్యాలను, గమ్యాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రేమ వివాహం వలన వచ్చే , జరిగే కష్ట నష్టాల గురించి చర్చించుకున్నారు. అలాగే, విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించి, విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ వార్డెన్ కెప్టెన్ సత్య వేణి ,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. (Story: సీతం గర్ల్స్ హాస్టల్‌లో వసంత పంచమి వేడుకలు)
See Also:
వలస పక్షులైతేనే… విజయం సాధిస్తాయా?
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2