సీతంలో పుల్వామా సంస్మరణ సభ మరియు వసంత పంచమి పూజ
విజయనగరం (న్యూస్ తెలుగు) : స్థానిక సీతం ఇంజనీరింగ్ కళాశాలలో వసంత పంచమిని పురస్కరించుకొని పూజా సభను నిర్వహించడం జరిగింది. ప్రస్తుత నేపథ్యంలో సనాతన భారత విలువలు మరుగున పడిపోతున్నాయని వాటిని పునర్దించవలసిన అవసరం ఎంతైనా ఉందని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ చెలపాక వెంకటలక్ష్మి ఈ సందర్భంలో ప్రసంగిస్తూ అన్నారు.
ఇదే సందర్భంలో భారత జాతి మర్చిపోలేని బాధాకరమైన ఫుల్వామా దాడి సంఘటనను గూర్చి వివరిస్తూ సీతం కళాశాల చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కోనాడ సత్యనారాయణ భారత సైనికుల సేవా నిరతి నిస్వార్ధ భావన అనన్య సామాన్యమనీ, సైనికుల కుటుంబాలకు సానుభూతిని ఆదరణను అందించడం అందరి గురుతర బాధ్యత అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. (Story: సీతంలో పుల్వామా సంస్మరణ సభ)
See Also:
బ్యూటిఫుల్ లవ్‌స్టోరి ఉషా పరిణయం
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2