మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి
కొయ్యలగూడెం (న్యూస్ తెలుగు): ముఖ్యమంత్రి జగన్ మహిళా సాధికారతకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారని రాజవరం గ్రామపంచాయతీ సర్పంచ్ ఏలేటి చిన్న తుక్కయ్య పేర్కొన్నారు. రాజవరం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం గ్రామంలో ఉన్న మహిళలకు వైయస్సార్ చేయూత పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ తుక్కయ్య మాట్లాడుతూ 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు మహిళల అభివృద్ధికి రూ. 18,500లను ప్రతి ఏటా వారి ఖాతాలలో జమ చేసి చిరు వ్యాపారాలు నిర్వహించుకుని అభివృద్ధి చెందాలని దృఢమైన సంకల్పంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తుక్కయ్య పేర్కొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిసి వి. శ్రీనివాస్, డ్వాక్రా సంఘాల సిఐలు, పంచాయతీ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ మహిళలు, తదితరులు పాల్గొన్నారు. (Story: మహిళా సాధికారతకు సీఎం జగన్ కృషి)
See Also:
వైసిపికి ప్రముఖ నేతలు గుడ్‌బై!
నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందే కేసీఆర్
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2