జోరుగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు
నాంపల్లి (న్యూస్‌తెలుగు) : గ్రామాలలో బెల్ట్ షాపులు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్న సంఘటన నాంపల్లి మండలంలోని పలు గ్రామాలలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని 32 గ్రామంలో ఉన్న బెల్టు దుకాణం అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్వహిస్తుండడంతో ప్రజలు మద్యం తాగి తరచూ గొడవలు పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. మండలంలోని దాదాపు అన్ని గ్రామాలలో బెల్ట్ షాపులు కొనసాగుతున్నప్పటికిని ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలలో మద్యం పట్టుకొని బేరసారాలాడి వదిలి పెడుతుండడంతో గ్రామాలలో బెల్ట్ షాప్ నిర్వహణకు అడ్డు లేకుండా పోయింది. నాంపల్లి మండల కేంద్రంలోని ఉన్న వైన్ షాపుల యజమాని తమ్ముడు బెల్టు షాపులు అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్లి మీ ఇంటికి వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాం సరుకు మా దగ్గరనే తీసుకొని పోవాలి అని చెప్పుకుంటూ నేరుగా అతనే బెల్టు షాపులకు చేరవేస్తున్నారు. ఇంకో వైన్స్ యజమాని నేరుగా పాత పరిచయాలు ఉన్న బెల్టు షాపుల దగ్గరికి అతని సొంత కారులోనే సప్లై చేస్తున్నారు. అక్కడక్కడ గ్రామస్తులు మీరు ఎందుకు మద్యం తేస్తున్నావని నిలదీస్తే లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి వైన్స్ లు పట్టినామని పెట్టిన ఖర్చులు ఎట్లా వస్తాయని సిండికేట్ ఐదామంటే వేరే వైన్స్ అయినా ఒప్పుకోవటం లేదని అందుకే మేమే నేరుగా చేరవేస్తున్నామని సమాధానం చెబుతున్నారు. నాంపల్లి ఎక్సైజ్ అధికారులకు బెల్ట్ షాపుల చేరవేస్తున్న విషయం తెలిసిన చూసి చూడనట్టుగా వ్యవహరించడం ప్రజలు వీరి పట్ల నమ్మకo పోయిందని అంటున్నారు. నాటు సారా ఎక్కడబడితే అక్కడ తయారీ చేస్తున్న పట్టించుకోవడంలేదని ప్రతినెల మామూలు అందుతుండడంతో వారు ప్రోత్సహిస్తున్నారని గ్రామస్తులు బహిరంగంగా విమర్శించుకుంటున్నారు. ఎక్స్చేంజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని నాంపల్లి మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (Story: జోరుగా కొనసాగుతున్న బెల్ట్ షాపులు)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2