Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌అవినీతిపై విచారణ జరిపించాలి

అవినీతిపై విచారణ జరిపించాలి

అవినీతిపై విచారణ జరిపించాలి

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య

నేరేడు చర్ల (న్యూస్ తెలుగు) : హుజూర్ న‌గర్ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై సిటింగ్ జడ్జితో ఎంక్వయిరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని, అదేవిధంగా స్థానిక పరిశ్రమలలో 70% స్థానికులను ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుపేదలకు సర్వేనెంబర్ 243 244 ప్రభుత్వ భూమిలో 126 గజాల తలం కేటాయించి ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శ‌నివారం నేరేడుచర్ల సెంటర్లో సిపిఐ (యంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసన్న మాట్లాడుతూ గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు జరిగాయని ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత కోల్పోయి అవినీతి జరిగిందని అవినీతిపై సిటింగ్ జడ్జితో ఇంక్వైరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని, అవినీతి సొమ్మును వెలికితిసి పేదలకు పంచాలని కోరారు. అదేవిధంగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి సర్వేనెంబర్ 243, 244 ప్రభుత్వ భూమిలో పేదల గుడిసెలు చేసుకొని నివసిస్తుంటే గత ప్రభుత్వం ఆ గుడిసెలను కూలగొట్టి వారిపై కేసులను పెట్టి ఇబ్బందుల గురి చేసిందని అన్నారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిచ్చిన హామీ ప్రకారం అర్హులైన ప్రతి పేదవాడికి 126 గజాల ఇంటి స్థలం కేటాయించి ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి కేటాయించాలని కోరారు. అదేవిధంగా స్థానిక పరిశ్రమలలో 70 శాతం మందికి ఉద్యోగాలు కల్పించి 30% స్థానికేతరులను తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్లను ప్రభుత్వం స్పందించి తక్షణమే పరిష్కరించాలని కోరారు. లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు గోపినపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, పిడియస్ యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్, పార్టీ డివిజన్ కన్వీనర్ పల్లన్న, ఐ యాప్ టియు జిల్లా నాయకులు సయ్యద్, పి వై ఎల్ జిల్లా నాయకులు కరుణాకర్, పి ఓ డబ్ల్యు సత్యక్క, పావని, మరియమ్మ, గోపి, మాలాంబి, లక్ష్మి, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు. (Story: అవినీతిపై విచారణ జరిపించాలి)

See Also: 

కెనడాలో ‘తెలుగు తల్లి’

ర‌వితేజ బ‌ర్త్‌డే గిఫ్ట్‌ అదిరిపోయింది!

రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవ‌ల్‌!

స‌రైనోడు మూవీని మించిపోయేలా!

‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2

రెస్పాన్స్ బ‌ట్టి డెవిల్‌కు సీక్వెల్!

యూనిక్ కంటెంట్ ‘బబుల్‌గమ్’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics