నా సేవలే గెలిపిస్తాయి : రామకోటయ్య
చాట్రాయి (న్యూస్‌తెలుగు) : ఎమ్మెల్యేగా తాను అందించిన నిస్వార్ధ సేవలే విజయాన్ని చేకూరుస్తాయి అని మాజీ ఎమ్మెల్యే చిన్నం రామకోటయ్య ధీమా వ్యక్తం చేశారు. శనివారం చాట్రాయిలో ప్రజాసభ ప్రాంగణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రకటించి ఏ గ్రామానికి వెళ్ళిన వేలమంది ఘన స్వాగతం పలికి ఆదరిస్తున్నారని ప్రజల ఆదరణతో తాను మళ్ళీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు .గతంలో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు ఇబ్బందుల్లో ఉన్నవారు ఎప్పుడు తనను కలిసిన తన శక్తి మేరకు సాయం అందించానని గుర్తు చేశారు. రేపు మండల కేంద్రమైన చాట్రాయి లో ప్రజాసభ కు ప్రజలు వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు. (Story: నా సేవలే గెలిపిస్తాయి : రామకోటయ్య)
See Also:
రవితేజ బర్త్‌డే గిఫ్ట్ అదిరిపోయింది!
రాబిన్‌హుడ్‌లో నితిన్ వేరే లెవల్!
‘సలార్ సీజ్ పైర్’ను మించి సలార్ పార్ట్ 2