కోట పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం
నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని స్థానిక కోట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సలీమ్ భాష సభాధ్యక్షత వహించడం జరిగింది. పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా శాప్ యోగా కో ఆర్డినేటర్ శ్రీమతి అంజనీ స్వప్న ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని,చదువులో ఏకాగ్రతకు ధ్యానం భాగా ఉపయోగ పడుతుంది అని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ ఒత్తిడిని జయించాలంటే యోగా ద్వారానే సాధ్యపడుతుందన్నారు. అనంతరం యోగ కో-ఆర్డినేటర్ విద్యార్థుల చేత ప్రాణాయామం, ధ్యానం, యోగాసనాలు, సూర్య నమస్కారాలు చేయించి వాటి ప్రాముఖ్యతను వాటి వల్ల శరీరానికి జరిగే ఉపయోగాలను క్షుణ్ణంగా తెలియజేశారు. ఈ యోగా దినోత్సవం కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు స్వయంగా యోగాసనాలు వేయడం చూపరులను ఆకట్టుకుంది. యోగా శిక్షణ అనంతరం నంద్యాల జిల్లా శాప్ యోగా కో-ఆర్డినేటర్ అంజని స్వప్నను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినులు శారదమ్మ, సాలమ్మ ,లలితమ్మ ,అరుణా విజయ భారతి,సరోజిని దేవి, షంషాద్ బేగం ఉపాధ్యాయులు మల్లికార్జున రెడ్డి , వెంకటేశ్వర్లు , వెంకట రమణ ,రామిరెడ్డి , నాగశేషులు తదితరులు పాల్గొన్నారు. (Story: కోట పాఠశాలలో ఘనంగా యోగా దినోత్సవం)