UA-35385725-1 UA-35385725-1

ఎన్‌టీఆర్‌ 30 కథ వెనుక గ్రేట్‌ ఐడియా!

ఎన్‌టీఆర్‌ 30 కథ వెనుక గ్రేట్‌ ఐడియా!

జూనియర్‌ ఎన్టీఆర్‌ 30వ మూవీకి రంగం సిద్ధమైంది. ఉగాది శుభసందర్భంగా ఈ మూవీ షూటింగ్‌కు సంబంధించి ముహూర్తం షాట్‌ను చిత్రీకరించారు. అతిరథమహారథులు హాజరైన ఈ కార్యక్రమంలో దర్శకుడు కొరటాల శివ ఎంతో కాన్ఫిడెన్స్‌తో మూవీ ఓ అద్భుతమవుతుందని చెప్పారు. ఇప్పటివరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ 29 చిత్రాలు తీశారు. ఎన్‌టీఆర్‌ 29వ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ అతని కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇది ఏకంగా ఆస్కార్‌ అవార్డు దాకా తీసుకుపోయింది. టాలీవుడ్‌లో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ వరల్డ్‌ ఫేమస్‌ హీరోల్లో ఒకరిగా మారిపోయారు. ఎన్‌టీఆర్‌ కొత్త చిత్రానికి ఇంకా టైటిల్‌ నిర్ణయించలేదు. ఎన్‌టీఆర్‌ 30గానే ప్రస్తుతానికి వర్కింగ్‌ టైటిల్‌గా నడుపుతున్నారు. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, హీరోయిన్‌గా శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌ను తీసుకున్నారు. ఇప్పటికే హీరోహీరోయిన్లకు సంబంధించిన తొల వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. 30వ చిత్రం ఓ వైపు ప్రారంభం అవుతుండగానే, 31వ చిత్రంగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో కమిట్‌ అయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన వర్క్‌ కూడా శరవేగంగా నడుస్తున్నది. ఆర్‌ఆర్‌ఆర్‌ బీభత్సమైన సక్సెస్‌ సాధించిన తర్వాత సహజంగానే ఎన్‌టీఆర్‌ 30వ సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువగానే వున్నాయి. కాకపోతే, ఎన్‌టీఆర్‌ వరుస హిట్లతో సక్సెస్‌ రేట్‌లో వుండగా, దర్శకుడు కొరటాల శివ మాత్రం మెగాస్టార్‌ చిరంజీవితో చేసిన తన ఆఖరి చిత్రం ఆచార్య అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయినప్పటికీ, ముందు అనుకున్న కమిట్‌మెంట్‌ ప్రకారం ఎన్‌టీఆర్‌, కొరటాల శివ చిత్రం ముందుగు సాగింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్‌ వచ్చింది. ఈ సినిమా ఎన్‌టీఆర్‌ కెరీర్‌లో అతిపెద్ద మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఈ 30వ సినిమా అటు ఎన్‌టీఆర్‌కు, ఇటు కొరటాల శివకు కీలకంగా మారింది. తెలుగులో తొలి చిత్రంగా అడుగుపెడుతున్న జాన్వి కపూర్‌ కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నది. తమిళ సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచంద్రన్‌ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. అలాగే రోబో, రంగస్థలం మూవీలకు ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టిన రత్నవేలు ఈ సినిమాకు ఎడిటింగ్‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభమవుతుంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ ప్రమోషన్స్‌ నుంచి, దాని షాడో నుంచి ఇప్పుడే బయటకు వచ్చిన ఎన్‌టీఆర్‌ ఇక పూర్తిగా ఈ సినిమాపైనే కాన్‌సెంట్రేషన్‌ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో భయం అనే కాన్సెప్ట్‌ను దర్శకుడు ప్రధానాంశంగా తీసుకున్నారు. ఈ కథ వెనుక గ్రేట్‌ ఐడియా వుందని కొరటాల శివ ముహూర్తం ఈవెంట్‌లో ప్రకటించారు. ఈ ఐడియాను క్యారీ చేయడం కోసమే కీలకమైన టెక్నీషియన్స్‌ను ఈ మూవీకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ మూవీ కథ వెనుక గల గ్రేట్‌ ఐడియా కచ్చితంగా పెద్దహిట్‌ను తీసుకువస్తుందని కొరటాల శివ నమ్మకంగా చెప్పారు. ఇదిలావుండగా, ఈ సినిమాను 300 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఇందులో హీరోయిన్‌ జాన్వి కపూర్‌ తన రెమ్యునరేషన్‌ కింద 4 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు తెలిసింది. భారీ తారాగణం వుండటంతోపాటు సినిమాను కూడా రిచ్‌గా తీయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముహూర్తం షాట్‌ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు ఎస్‌ఎస్‌ రాజమౌళి తదితరులు హాజరయ్యారు. (Story: ఎన్‌టీఆర్‌ 30 కథ వెనుక గ్రేట్‌ ఐడియా!)

The News on YouTube

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1