రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్
అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు.
►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
2023 బడ్జెట్ కేటాయింపులు..
GD
►వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
►వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
►వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
►వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
►జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
►వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు
►వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
►వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
►మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు
►రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
►లా నేస్తం-రూ.17 కోట్లు
►జగనన్న తోడు- రూ.35 కోట్లు
►ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
►వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
►వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు
►వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు
►అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
►ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
►వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు
►మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
►జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
►పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
►స్కిల్ డెవలప్‌మెంట్ రూ. 1,166 కోట్లు
►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు
►షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
►షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
►వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు
►కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు
►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు
►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
►ఎనర్జీ- రూ.6,456 కోట్లు
►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన
సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల
దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్ కార్డుల జారీ
ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం
రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు
ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలు
విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు
మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు
సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు
వైఎస్సార్ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు
17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది. (Story: ఏపీ బడ్జెట్ హైలైట్స్!)