అదుపులో నిందితుడు హరిహరకృష్ణ
తాజాగా నిందితుడి స్నేహితుడు హసన్, ప్రియురాలు కట్టా నిహారికారెడ్డి అరెస్ట్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థి నవీన్ హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడు హరిహరకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు పలు విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. తాజాగా నిందితుడి స్నేహితుడు హసన్, ప్రియురాలు కట్టా నిహారికారెడ్డిని అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎల్బీ నగర్ డీసీపీ సాయిశ్రీ మీడియాకు వెల్లడించారు. ప్రేమకు అడ్డుగా ఉన్న స్నేహితుడు నవీన్‌ను గుండె కోసి శరీరాన్ని ఛిద్రం చేసి హతమార్చిన హరిహరకృష్ణ.. హత్య అనంతరం ఈ విషయాన్ని ప్రియురాలికి చెప్పి ఘటనాస్థలికి చూపించినట్లు విచారణలో తేలింది. అందుకే నిందితుడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. నవీన్ హత్య కేసులో హరిహర కృష్ణ స్నేహితుడు హాసన్, ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు న్యాయమూర్తి నివాసంలో హాజరు పరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. హాసన్ ను చర్లపల్లి జైలు , నీహారిక ను చంచల్ గూడ మహిళా జైలుకు పోలీసులు తరలించనున్నారు. (Story: నవీన్ హత్య కేసులో కీలక మలుపు!)
The News in YouTube