Home వార్తలు జాతీయం హిజాబ్‌తో అనుమతించినందుకు టీచర్‌ సస్పెన్షన్‌!

హిజాబ్‌తో అనుమతించినందుకు టీచర్‌ సస్పెన్షన్‌!

0
Hijab Issue
Hijab Issue

హిజాబ్‌తో అనుమతించినందుకు టీచర్‌ సస్పెన్షన్‌!

బెంగుళూరు: ముస్లిమ్‌ల మతాచారం హిజాబ్‌పై గత కొన్ని మాసాలుగా దేశంలో రగడ కొనసాగుతున్న విషయం తెల్సిందే. హిజాబ్‌ (ముస్లిమ్‌ అమ్మాయిలు తలకు చుట్టూ కట్టుకొని గుడ్డ)ను ధరించి కాలేజీలోకి రావద్దంటూ కర్నాటకలో మొదలైన వివాదం దాదాపు పది రాష్ట్రాలకు పాకింది. బీజేపీతోపాటు సంఫ్‌ుపరివార్‌కు చెందిన సంస్థలు ఈ చర్యలకు మద్దతు పలకగా, లౌకికవాదులు ఈ చర్యలను ఖండిస్తూ వచ్చారు. తాజాగా కర్నాటకలోని కాలాబురాగీ జిల్లాలో హిజాబ్‌ అంశంపై మరో టీచర్‌ సస్పెండ్‌ అయ్యారు. గురువారం పరీక్ష జరుగుతున్న సమయంలో హిజాబ్‌ ధరించి రాసేందుకు అనుమతించిందామె. అంతకుముందు, బుధవారం గదగ్‌ జిల్లాలో గర్ల్‌ స్టూడెంట్స్‌ను పరీక్ష రాసేందుకు అనుమతించడంతో ఏడుగురు టీచర్లను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై కాలాబురాగి జిల్లా అధికారులపై విచారణకు ఆదేశించారు. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి హిజాబ్‌ అంశం చర్చనీయాశంగా మారింది. విద్యా సంస్థల్లోకి హిజాబ్‌తో అనుమతించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిపారు. ఈ మేరకు హిజాబ్‌ నిషేదాన్ని ఛాలెంజ్‌ చేస్తూ కర్నాటక హైకోర్టులో వేసిన పిటిషన్లను త్రిసభ్య బెంచ్‌ కొట్టిపారేసింది. హిజాబ్‌ అనేది ఇస్లాంలో తప్పనిసరి అంశం కాదని కోర్టు పేర్కొంటూ విద్యాసంస్థలు నిర్దేశించిన యూనిఫామ్‌ను మాత్రమే ధరించాలని సూచించింది. ఇది మతపరమైన సున్నితమైన అంశం కావడంతో దీనిపై ఎక్కువగా చర్చ పెట్టుకోవడం తప్పిదమే. అందువల్ల హిజాబ్‌కు సంబంధించి ఏది జరిగినా అది విపరీతమైన ప్రచారంలోకి వస్తోంది. అయితే ఈ తరహా చట్టం కేవలం బీజేపీ పాలిత కర్నాటకలో మాత్రమే వుంది. (Story: హిజాబ్‌తో అనుమతించినందుకు టీచర్‌ సస్పెన్షన్‌!)

See Also: ఐఏఎస్‌లకు జైలుశిక్ష ఎలా వుందంటే!

మేకపాటి గౌతమ్‌రెడ్డి స్థానంలో మంత్రి ఎవరో తెలుసా?

మాకొద్దీ మంత్రిగిరీ! Special Story)

See Also: ఎంత దారుణం : శవంతో సెక్స్‌!

రామ్‌చరణ్‌తో బిగ్‌ డీల్‌ నిజమేనా?

జ్వరం టాబ్లెట్‌ రూ. 100

క్యాబినెట్‌ విస్తరణ ముహూర్తం కుదిరింది!

ఇకపై ఇంటర్వ్యూలు లేకుండానే ఉద్యోగాలు!

వావ్‌! లేపాక్షికి యునెస్కో గుర్తింపు!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version