Home క్రీడలు చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌! (Full Details)

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌! (Full Details)

0
Sanju Samson
Sanju Samson

చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌!

ఎస్‌ఆర్‌హెచ్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం

పూణే: చెత్తగా ఆడి చిత్తుగా ఓడిపోవడంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తన సాంప్రదాయాన్ని నిలబెట్టుకున్నది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2022 సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌లలో టాస్‌ గెలిచిన ప్రతిజట్టూ విజయం సాధించింది. కానీ సన్‌రైజర్స్‌ మాత్రం భిన్నమైనది. టాస్‌ గెలిచి మరీ పరాజయంపాలైంది. మంగళవారం రాత్రి పూణేలోని ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఐపీఎల్‌ 5వ లీగ్‌ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 61 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై తిరుగులేని విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగుల భారీ స్కోరు చేయగా, హైదరాబాద్‌ 7 వికెట్లు కోల్పోయి 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజస్థాన్‌ బ్యాటింగ్‌ను అదుపు చేయడంలో విఫలమైన హైదరాబాద్‌ ఆ తర్వాత తన బ్యాటింగ్‌లోనూ చతికిలపడిరది. ఆర్‌ఆర్‌ కెప్టెన్‌ సంజూ శామ్సన్‌ అద్వితీయమైన బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించి గెలిపించాడు. మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అతనికే దక్కింది. యజువేందర్‌ చాహల్‌ అద్భుతమైన బౌలింగ్‌ ఆర్‌ఆర్‌కు కలిసొచ్చింది.

భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులోని టాప్‌ఆర్డర్‌ ఘోరంగా కుప్పకూలింది. యజువేందర్‌ చాహల్‌, ప్రసిద్ధ్‌కృష్ణ, ట్రెంట్‌ బౌల్ట్‌ల బౌలింగ్‌ను సన్‌రైజర్స్‌ తట్టుకోలేకపోయింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (2), అభిషేక్‌ శర్మ (9), రాహుల్‌ త్రిపాఠీ (0), నికొలస్‌ పూరణ్‌ (0), అబ్దుల్‌ సమద్‌ (4)లు వెంటవెంటనే పెవిలియన్‌ దారిపట్టారు. 29 పరుగులకు 4 వికెట్లు, 37 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్రకష్టాల్లో కూరుకుపోయిన సన్‌రైజర్స్‌ను ఎయిడెన్‌ మార్కరమ్‌ ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తొలి 5 వికెట్లలో చాహల్‌, కృష్ణలు రెండేసి వికెట్లు తీసుకొని ప్రత్యర్థి టాప్‌ఆర్డర్‌ను వెనక్కి పంపించేశారు. రెండు సిక్సర్లు కొట్టి మంచి ఊపుమీద ఉన్నట్లు అన్పించిన షెఫర్డ్‌ (24)ను కూడా చాహల్‌ అవుట్‌ చేశాడు. ఈ దశలో మార్కరమ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు నష్టాన్ని భర్తీ చేయడానికి యత్నించారు. కేవలం 14 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి మెరుపులు మెరిపించిన సుందర్‌ 19వ ఓవర్‌ ఆఖరులో ట్రెంట్‌ బౌల్ట్‌ వేసిన లైన్‌ అండ్‌ లెన్త్‌ బంతిని టిప్‌ చేయబోయి హెట్మెయిర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. చివరి 6 బంతుల్లో 70 పరుగుల లక్ష్యం సన్‌రైజర్స్‌ ముందు నిలిచే పరిస్థితి దాపురించింది. ఆ ఓవర్‌లో 14 పరుగులు చేశాడు. మార్కరమ్‌ ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టి అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆయనతోపాటు భువనేశ్వర్‌ నాటౌట్‌గా మిగిలిపోయారు. మార్కరమ్‌ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 57 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో చాహల్‌ 3, బౌల్ట్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు, టాస్‌ గెలిచిన సన్‌రైజర్స్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే ఆర్‌ఆర్‌ దాన్ని తనకు లభించిన అవకాశంగా భావించి, ఆది నుంచీ వీరబాదుడుకు పూనుకున్నది. ఆర్‌ఆర్‌ ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు నమోదయ్యాయి. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌ (35, 28 బంతులు, 3I4, 3I6), యశస్వీ జైశ్వాల్‌ (20, 16 బంతులు, 2I4, 1I6)లు తొలి వికెట్టుకు 58 పరుగుల భాగస్వామ్యం అందించారు. పవర్‌ప్లేను ఏంచక్కా వాడుకున్నారు. రొమారియో షెఫర్డ్‌ బౌలింగ్‌లో మార్కరమ్‌ పట్టిన క్యాచ్‌కు జైశ్వాల్‌ అవుటైన తర్వాత సంజూ శామ్సన్‌ బరిలోకి దిగాడు. 9వ ఓవర్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ బౌలింగ్‌లో నికొలస్‌ పూరణ్‌ క్యాచ్‌పట్టగా బట్లర్‌ నిష్క్రమించాడు. అయితే సంజూ దూకుడును ఎవరూ ఆపలేకపోయారు. అతను కేవలం 27 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు సాధించాడు. సంజూ 203 స్ట్రయిక్‌రేటుతో సన్‌రైజర్స్‌ బౌలర్లను బాదిపారేశాడు. అతని స్కోరులో 42 పరుగులు కేవలం ఫోర్లు, సిక్సర్లతో లభించినవే. దేవదత్‌ పడిక్కల్‌తో కలిసి సంజూ మూడవ వికెట్టుకు 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు. పడిక్కల్‌ కూడా దిగుతూనే ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. అతను 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 41 పరుగులు చేసి ఉమ్రాన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం షిమ్రోన్‌ హెట్మెయిర్‌ రంగంలోకి దిగి సంజూకు అండగా నిలిచాడు. కాకపోతే సంజూ అర్థసెంచరీ పూర్తయిన తర్వాత భువనేశ్వర్‌ బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. హట్మెయిర్‌ ఉన్నంతలో 13 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 32 పరుగులు చేసి నటరాజన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అతను తన స్కోరును దాదాపు బౌండరీలు, సిక్సర్లతోనే నడిపేశాడు. అతను కూడా ఆఖరి ఓవర్‌లో అవుటయ్యాడు. అదే ఓవర్‌లో రియాన్‌ పరాగ్‌ ఆఖరి బంతిని భారీషాట్‌కు ప్రయత్నించబోయి నటరాజన్‌ బౌలింగ్‌లో పూరణ్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో 210 పరుగుల వద్ద ఆర్‌ఆర్‌ స్కోరు ఆగిపోయింది. సన్‌రైజర్స్‌ బౌలర్లలో నటరాజన్‌, ఉమ్రాన్‌లు రెండేసి వికెట్లు, షెఫర్డ్‌, భువనేశ్వర్‌లు చెరొక వికెట్టు తీసుకున్నారు. (Story: చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన సన్‌రైజర్స్‌! (Full Details))

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version