Home సినిమా ఓటీటీ ఓటీటీలో రాధేశ్యామ్‌! ఎప్పుడంటే?

ఓటీటీలో రాధేశ్యామ్‌! ఎప్పుడంటే?

0
Radhe Shyam
Radhe Shyam

ఓటీటీలోకి.. రాధే శ్యామ్‌: స్ట్రీమింగ్‌ అప్పటి నుంచే!

ముంబయి: రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ డైరెక్షన్‌లో ఇటీవల విడుదలైన రాధే శ్యామ్‌ సినిమా ఓటీటీలో రాబోతోంది. ఏప్రిల్‌ ఒకటిన అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో రాధే శ్యామ్‌ అందుబాటులోకి రాబోతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌వీడియో అధికారికంగా ట్వీట్‌ చేసింది. మార్చి 11న రాధే శ్యామ్‌ థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెల రోజులు కాకముందే అంటే ఏప్రిల్‌-1న ఓటీటీలోకి రాధేశ్యామ్‌ వస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ ధియేటర్లలోకి వచ్చిన తర్వాత రాధేశ్యామ్‌ ప్రదర్శన కష్టమైపోయింది ఒక విధంగా చెప్పాలంటే, రాధేశ్యామ్‌ ఒక మంచి క్లాజికల్‌ మూవీగా పరిగణించవచ్చు. మ్యూజిక్‌, విజువల్స్‌ వంటి కొన్ని కోణాల్లో రాధేశ్యామ్‌ ఆకట్టుకుంది. కాకపోతే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమాపై అభిమానులు సైతం పెదవి విరిచారు. డివైడ్‌ టాక్‌ రావడంతో.. ఈ మూవీ థియేటర్లోంచి త్వరగానే వెళ్లిపోవాల్సి వచ్చింది. మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ రావడంతో రాధేశ్యామ్‌ను థియేటర్స్‌ నుంచి తీసేశారు. అందుకే ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి విడుదల చేయబోతోన్నట్లుగా సమాచారం. ఏప్రిల్‌ ఒకటిన ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో రాబోతోంది. మొత్తానికి రాధే శ్యామ్‌ మాత్రం నెల రోజులు తిరక్కుండానే ఓటీటీలోకి వస్తోంది. (Story: ఓటీటీలో రాధేశ్యామ్‌! ఎప్పుడంటే?)

See Also: మళ్లీ పెరిగిన ఆర్‌టిసి ఛార్జీలు

 చైనాలో లాక్‌డౌన్‌!

రాజమౌళి కొత్త సినిమా అప్‌డేట్‌ : బడ్జెట్‌ రూ.800 కోట్లు

ఆ 10 మందికీ మంత్రిపదవులు ఖాయం!)

మందుబాబులకు హ్యాపీ న్యూస్‌..!

తొలిరోజే ఆర్‌ఆర్‌ఆర్‌ కలెక్షన్ల తుఫాన్‌!

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ అసలు రివ్యూ ఇదే!

మెగాస్టార్ మేడే!

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version