సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ : ఏం చర్చించారంటే?
న్యూఢిల్లీ: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ కార్యవర్గం ఢిల్లీలో శనివారంనాడు సమావేశమైంది. మూడు రోజుల పాటు జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాల సందర్భంగా తొలి రోజు కార్యవర్గం భేటీ అయింది. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యదర్శులు కె.రామకృష్ణ (ఆంధ్రప్రదేశ్), చాడా వెంకటరెడ్డి (తెలంగాణ) కూడా హాజరయ్యారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు 80 శాతం బీజేపీకి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకున్నది. పంజాబ్‌లో ఆప్ గెలవడమొక్కటే జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఆకాంక్షించే వామపక్షాలకు ఊరట కలిగించింది. మిగిలిన నాలుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లలో బీజేపీ గెలిచింది. బీజేపీకి సీట్లు తగ్గినా ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటంత గెలుపు లభించడంతో కాషాయవర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది. పైగా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ ఐదు రాష్ట్రాల్లోనూ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొత్తగా జాతీయ ఫ్రంట్ ఏర్పాటైతే దానికి కాంగ్రెస్ నేతృత్వం వహించాలని ఆరాటపడుతున్నప్పటికీ, ఈ తాజా ఫలితాలు ఆ పార్టీకి షాకిచ్చాయి. అందుకే బీజేపీ, కాంగ్రెస్సేతర పక్షాలు ఒక దారిలో వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోపే తృతీయ శక్తులన్నీ ఒక చోటకు రావడానికి ప్రయత్నాలు మొదలుకావాలి. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ, యూపీ ఫలితాలతో కాస్త ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ, చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు అధికారంలో వున్నందున జాతీయ ఫ్రంట్ ఏర్పాటుకు ఢోకా లేదు. ఈ పరిణామాలన్నీ ఢల్లీిలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. మూడు రోజులపాటు జరిగే పార్టీ కౌన్సిల్ సమావేశాలు 14వ తేదీ సాయంత్రం ముగియనున్నాయి. అక్టోబరులో విజయవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభల ఏర్పాట్లపై కూడా ఈ కార్యవర్గంలో చర్చించినట్లు తెలిసింది. (<¸Š=@‚z|˜Ÿ సీపీఐ జాతీయ కార్యవర్గం కీలక భేటీ : ఏం చర్చించారంటే?)
See Also: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్-Full Details
ఉక్రెయిన్‌లో బయో బాంబ్స్?