Homeవార్తలుపవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’

పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పుట్టినరోజున గ్రాండ్‌గా విడుదలకాబోతోన్న ‘జేమ్స్’

పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’ : కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రిపబ్లిక్ డే‌కి విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, రీసెంట్‌గా విడుదల చేసిన ‘ట్రేడ్ మార్క్’ లిరికల్ వీడియో సాంగ్‌ ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. చిత్రాన్ని పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని మార్చి 17న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హీరో శ్రీకాంత్, విజయ్. ఎమ్‌ సంయుక్తంగా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. పునీత్ రాజ్‌కుమార్ ఆర్మీ ఆఫీసర్‌గా నటించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్ నటించగా, విలన్‌గా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ నటించారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, మార్చి 17న చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నామని.. హీరో శ్రీకాంత్‌తో కలిసి ఈ చిత్రాన్ని టాలీవుడ్‌లో విడుదల చేస్తున్న విజయ్. ఎమ్ తెలిపారు.

పునీత్ రాజ్‌కుమార్, డాక్టర్ శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్, ప్రియా ఆనంద్, శ్రీకాంత్, శరత్ కుమార్, ముఖేష్ రిషి, ఆదిత్య మీనన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
బ్యానర్: కిశోర్ ప్రొడక్షన్స్,
సంగీతం: చరణ్ రాజ్,
సినిమాటోగ్రఫీ: స్వామి జె గౌడ,
ఆర్ట్: రవి శాంతేహైక్లు,
పీఆర్వో: బి. వీరబాబు
ఎడిటింగ్: దీపు ఎస్ కుమార్,
నిర్మాత: కిశోర్ పత్తికొండ,
దర్శకత్వం: చేతన్ కుమార్. (Story: పవర్ స్టార్ పుట్టినరోజునే ‘జేమ్స్’)

See Also: Do You Know About Koo Innovative Features

Bacardi’s Good Man Brandy Out Now

డిజిటల్‌ సంచలనం : ప్రపంచంలోనే తొలి మెటావర్స్‌ పెళ్లి!

తెలంగాణలో ఉద్యోగమేళా! Full Details

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!