Home జీవనశైలి ఆరోగ్యం మ‌గువ‌ల అందానికి బాదాములు

మ‌గువ‌ల అందానికి బాదాములు

0
Almonds
Almonds

మ‌గువ‌ల అందానికి బాదాములు

మెరుగైన చర్మ ఆరోగ్యం పొందడం కోసం బాదములను స్నాకింగ్‌గా తీసుకోవడానికి ప్రాధాన్యతనిస్తోన్న భారతీయ మహిళలు : యు గవ్‌ అధ్యయనం

  • బాదములలో అత్యధిక పరిమాణంలో విటమిన్‌ ఈ ఉండటం వల్ల తమకు అధిక ప్రయోజనం కలుగుతుందని భారతీయ మహిళలు గుర్తిస్తున్నారు
  • 59% మంది మహిళలు బాదములు రోజూ తింటున్నారు
  • బాదములను ప్రతి రోజూ తినడం వల్ల కనిపించే ప్రధానమైన ఆరోగ్య ప్రయోజనం చర్మ సౌందర్యం అని 70% మంది మహిళలు భావిస్తున్నారు

మ‌గువ‌ల అందానికి బాదాములు:ః వేగవంతమైన ప్రపంచం, అందుబాటులో అపరిమిత సమాచారం కారణంగా భారతదేశ వ్యాప్తంగా మహిళలు చర్మ ఆరోగ్యంతో  పౌష్టికాహారానికి ఉన్న సంబంధం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటున్నారు. మనం తీసుకునే ఆహారం , మన చర్మ ఆరోగ్యానికి మనం ఉపయోగించే ఉత్పత్తుల్లాగానే కీలకమైనదని భావిస్తున్నారు.  తగిన రీతిలో పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన చర్మం  సాధ్యం కాదు. మరీముఖ్యంగా అత్యంత కఠినమైన చర్మసంరక్షణ పద్ధతులు అనుసరించినప్పటికీ దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్యవంతమైన జీవనశైలి మరియు  రోజువారీ డైట్‌కు సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలు దిశగామారుతున్న  వినియోగదారుల ప్రాధాన్యతలపై చేసిన అధ్యయనంలో  ఈ అంశం వెల్లడైంది.

అధ్యయనంలో కీలకాంశాలు ః

  • భారతదేశంలో 58% మంది మహిళలు చర్మ, జుట్టు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు
  • ఆరోగ్యంగా ఉన్నామనే దానికి సూచిక  అందం అని 80% మంఇ భారతీయులు భావిస్తున్నారు.
  • బ్యూటీ, సిన్‌ కేర్‌ ఉత్పత్తులు మరియు ధోరణలు గురించి ప్రతి ఇద్దరులో ఒకరు చదువుతున్నారు
  • 53%కు పైగా మహిళలు మరింతగా ఆరోగ్యవంతమైన ఆహారం అయినటువంటి బాదములను వ్యాయామాలతో పాటుగా తీసుకోవడమనేది  ఆరోగ్యవంతమైన చర్మం పొందడంలో అత్యంత కీలకమని భావిస్తున్నారు.
  • 79% మంది మహిళలు బాదములు రోజూ తింటున్నారు.
  • బాదములను తినడం వల్ల ప్రకాశవంతమైన చర్మం (70%), మడతలు తగ్గడం (55%), యువీ కిరణాల నుంచి చర్మం కాపాడుకోవడం (47%) సాధ్యమవుతుందంటున్నారు
  • 60% కు పైగా మహిళలు ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ అయినటువంటి పండ్లు, బాదములు తినడంతో పాటుగా పండ్లు, బాదములు, గ్రీన్‌ టీ ప్రయోజనాలను సైతం గుర్తిస్తున్నారు
  • ఆరోగ్యవంతమైన చర్మం కోసం విటమిన్‌ ఈ అతి ముఖ్యమని 66% మంది మహిళలు భావిస్తున్నారు
  • 59% మంది మహిళలు ప్రతి రోజూ బాదములను నానబెట్టి తింటున్నారు
  • 60% మంది మహిళలు అత్యంత అందమైన చర్మం కోసం యాంటీఆక్సిడెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని, బాదములలో ఇవి అత్యధికంగా ఉన్నాయని భావిస్తున్నారు.

ఇటీవలనే  అంటే 07 డిసెంబర్‌ నుంచి 22 డిసెంబర్‌ మధ్యకాలంలో పరిశోధనా కన్సల్టింగ్‌ సంస్ధ యుగవ్‌ (YouGov) ఓ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం భారతదేశంలో 72% మంది మహిళలు  ఆరోగ్యవంతమైన డైటరీ మార్పులు  అత్యంత అందంగా కనిపించే చర్మానికి అతి ముఖ్యమైన ముందడుగా  భావిస్తున్నారు.

యుగవ్‌ నిర్వహించిన ఈ క్వాంటిటేటివ్‌ అధ్యయనం ద్వారా  అందం, స్నాకింగ్‌ నడుమ సంబంధాన్ని వెల్లడించడంతో పాటుగా  బ్యూటీ ప్రయోజనాల కోసం మహిళల స్నాకింగ్‌ అర్ధం చేసుకునే ప్రయత్నం చేసింది.  ఈ అధ్యయనాన్ని ఢిల్లీ, లక్నో, లుథయానా, జైపూర్‌, ఇండోర్‌, కోల్‌కతా, భుబనేశ్వర్‌, ముంబై. అహ్మదాబాద్‌, పూనె, బెంగళూరు, కోయంబత్తూరు,హైదరాబాద్‌ మరియు  చెన్నైలలో 3,959 మంది మహిళలపై చేశారు.

ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం, భారతదేశంలో దాదాపు  80% మంది మహిళలు అందం అనేది ఆరోగ్యంతో పాటుగానే ప్రకాశిస్తుందని  భావిస్తున్నారు. కేవలం చర్మ సంరక్షణ ఉత్పత్తుల వినియోగం వల్ల ప్రయోజనం  లేదని వారు గుర్తిస్తున్నారు.  ఈ అధ్యయనంలో పాల్గొన్న మహిళల్లో అధికశాతం మంది  తగిన విశ్రాంతితో పాటుగా ఆరోగ్యవంతమైన డైట్‌ తీసుకోవడం , తగినంతగా వ్యాయామాలు జీవనశైలి సమతుల్యతలో అత్యంత కీలకమని భావిస్తున్నారు. ఆరోగ్యవంతమైన చర్మానికి ఇది  అనుసరణీయమనీ వెల్లడించారు.

మొత్తంమ్మీద ఈ ఫలితాలు చూపేదాని ప్రకారం మహిళలు ఆరోగ్యవంతమైన మరియు పౌష్టికాహార పదార్థాలైనటువంటి బాదములు, పండ్లు వాటిపై ఆధారపడుతున్నారు. మరీ ముఖ్యంగా చర్మ సౌందర్యాకి పండ్లు మరియు బాదములు అత్యంత కీలకమని వెల్లడిస్తున్నారు.

ఆరోగ్యవంతమైన డైట్‌ నిర్వహణ పరంగా ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తే, అధిక శాతం మంది మహిళలు ఇంటి  భోజనంతో అత్యంత అందమైన చర్మం చేరగలమని భావిస్తున్నారు. ఫైబర్‌ అధికంగా కలిగిన డైట్‌  మరియు బాదములు లాంటి గింజలు తీసుకోవడం అవసరమని భావిస్తున్నారు. భారతీయ మహిళల నడుమ బాదములు అత్యంత  ప్రాధాన్యత కలిగిన ఆహారంగా మారింది. బాదములలో విటమిన్‌ ఈ అధికంగా ఉంది. చర్మ ఆరోగ్యానికి సైతం ఇది తోడ్పడుతుందని భావిస్తున్నారు.  బాదములలో  విటమిన్‌ ఈ అధికంగా ఉంది. అందువల్ల ఈ కోణంలో అన్ని గింజల్లోనూ బాదములు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. వీటితో పాటుగా ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 59% మంది మహిళలు బాదములు ప్రతి రోజూ తింటున్నారు. మరీ ముఖ్యంగా వీటిని నానబెట్టుకుని లేదంటే ముడి బాదముల రూపంలో  తీసుకుంటున్నారు. ఈ కారణం చేత బాదములను తరచుగా తినే నట్‌గా పరిగణిస్తున్నారు.

మహిళలు మరీ ముఖ్యంగా 30–39 సంవత్సరాల వయసులో ఉండటంతో పాటుగా మిల్లీనియల్స్‌ అత్యధికంగా ముడతలు తగ్గించడం, చర్మ ప్రకాశం మరియు చర్మ సంరక్షణ కోసం బాదమలు తీసుకుంటున్నారు.  అదే సమయంలో జెనెక్స్‌ అత్యధికంగా  బాదములను మడతలు తగ్గించడం కోసం వినియోగిస్తున్నారు. ఈ విశ్లేషణను తమ వ్యక్తిగత అనుభవాలను పునరుద్ఘాటించడానికి మరీ ముఖ్యంగా బాదములు తిన్న తరువాత తమ  చర్మంపై మెరుగైన ప్రభావం తక్షణమే చూడటానికి వినియోగిస్తున్నారు. నిజానికి,  ఆరు నెలల పాటు ఏకధాటిగా బాదములు తినే వారిలో  సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మరీముఖ్యంగా చర్మం ప్రకాశవంతంగా మారడం,  యవ్వనంగా  ఉండటం పరిశీలిస్తున్నారు. మరీ ముఖ్యంగా బాదములను ఆలస్యంగా తీసుకోవడం ప్రారంభించిన వారిలో  ఇది ఎక్కువగా కనబడుతుంది.

ఈ అధ్యయనం గురించి న్యూట్రిషన్‌ అండ్‌ వెల్‌నెస్‌  కన్సల్టెంట్‌ షీలా కృష్ణస్వామి మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు ఆసక్తిగా ఉన్నాయి . ఈ ఫలితాలు వెల్లడించిన దాని ప్రకారం, ఆరోగ్యవంతమైన స్నాకింగ్‌ సహా ఆరోగ్యవంతమైన జీవనశైలి ఒకరి చర్మ ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. బాదములలో అత్యధిక పరిమాణంలో యాంటీఆక్సిడెంట్‌  విటమిన్‌ ఈ ఉంది . ఇది ఫ్యాటీ యాసిడ్స్‌  మరియు పాలిఫెనాల్స్‌ కలిగి ఉంది.  అందువల్ల ఇవి అత్యుత్తమ ప్రాధాన్యతగా నిలుస్తున్నాయి. ఇటీవలనే నిర్వహించిన  ఓ అధ్యయనం వెల్లడించిన దాని ప్రకారం బాదములతో ముఖంలో మడతలు పోవడంతో పాటుగా చర్మం కూడా ప్రకాశవంతం అవుతుంది. ఈ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధిక శాతం తమచర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించారు. తమ రోజువారీ ఆహారంలో బాదములను  జోడించుకోవాల్సిందిగా నేను మహిళలను కోరుతున్నాను. తద్వారా వాను  ఆరోగ్యవంతమైన  చర్మమూ పొందగలరు’’ అని అన్నారు.

కాలంతో పాటుగా, అధిక శాతం మంది తమ ఆరోగ్యం, పౌష్టికాహారం   పట్ల ఆప్రమప్తతో వ్యవహరిస్తున్నారు. ఇది మా అధ్యయనంలో అత్యధికంగా ప్రతిబింబించింది. ఈ అధ్యయన ఫలితాలు వెల్లడించే దాని ప్రకారం  భారతీయ మహిళలు తాము కనిపించే విధానం పట్ల అమితంగా ఆందోళన  చెందుతున్నారు. ఈ  అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం, ఆరోగ్యవంతమైన డైట్‌తో పాటుగా క్రమం తప్పనివ్యాయామాలు, తగినంతగా నిద్ర మరియు ఆరోగ్యవంతమైన, ప్రకాశవంతమైన  చర్మం కోసం  తప్పనిసరి !

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3997530/

https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3997530/

3 Rybak I, Carrington AE, Dhaliwal S, Hasan A, Wu H, Burney W, Maloh J, Sivamani RK. Prospective Randomized Controlled Trial on the Effects of Almonds on Facial Wrinkles and Pigmentation. Nutrients. 2021; 13(3):785. https://doi.org/10.3390/nu13030785

See Also: Indian women prefer snacking on almonds

Kalaavathi Hits 50 Million Views

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version