Home టాప్‌స్టోరీ 1న‌ రామారావు ఆన్ డ్యూటీ` టీజర్

1న‌ రామారావు ఆన్ డ్యూటీ` టీజర్

0
Ramarao On Duty
Ramarao On Duty

శివరాత్రి కానుక  గా మాస్ మహారాజా రవితేజ,`రామారావు ఆన్ డ్యూటీ` టీజర్ విడుదల
1న‌ రామారావు ఆన్ డ్యూటీ` టీజర్

1న‌ రామారావు ఆన్ డ్యూటీ` టీజర్: మాస్ మహారాజా రవితేజ  యాక్షన్ థ్రిల్లర్ `రామారావు ఆన్ డ్యూటీ` ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి కాగా రెండు పాటల చిత్రీకరణ పెండింగ్లో ఉంది. సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ LLP మరియు RT టీమ్వర్క్స్పై రూపొందుతోంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.

`రామారావు ఆన్ డ్యూటీ`సినిమా టీజర్ లాంచ్ తేదీని మేకర్స్ ఖరారు చేశారు. రామారావు ఆన్ డ్యూటీ టీజర్ మార్చి 1వ తేదీన మహా శివరాత్రి శుభ సందర్భంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ రవితేజ న్యూ యాక్షన్ పోస్టర్ విడుదలచేసింది. ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకునేలా సరికొత్త గెటప్లో కనిపించారు. ఈ పోస్టర్ భారీ రెస్పాన్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా చక్కర్ లు కొడుతోంది

వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం శామ్ సిఎస్ అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్సి కెమెరా క్రాంక్ చేశారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్.

ఇది యదార్థ సంఘటనల నుండి స్పూర్తి పొందిన కథ, సినిమా ప్రచార కంటెంట్కు అద్భుతమైన స్పందన వచ్చింది.

నటీనటులు: రవితేజ, దివ్యాంశ  కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామ కృష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు. (Story: 1న‌ రామారావు ఆన్ డ్యూటీ` టీజర్)

సాంకేతిక సిబ్బంది:
కథ, స్క్రీన్ప్లే, మాటలు & దర్శకత్వం: శరత్ మండవ
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్ LLP, RT టీమ్వర్క్స్
సంగీత దర్శకుడు: శామ్  సిఎస్
DOP: సత్యన్ సూర్యన్ ISC
ఎడిటర్: ప్రవీణ్ కెఎల్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
PRO: వంశీ-శేఖర్

See Also: 15కి ఎగబ్రాకిన పుష్ప

 

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version