మోడీపై మరోసారి కేసీఆర్ నిప్పులు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఫైర్ అయ్యారు. బీజేపీని చెత్తబుట్టలో వేయడానికి అవసరమైతే కొత్త పార్టీని పెడతానని ప్రకటించారు. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
కేసీఆర్ ప్రెస్‌మీట్ వివరాలు ఆయన మాటల్లోనే…
నిన్న, మొన్న జనగామ, యాదాద్రి జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం. ఈ సందర్భంగా బహిరంగ సభలో అన్ని విషయాలు చెప్పలేం. అయినా ప్రజలకు కొన్ని వివరాలు చెప్పాలని చెప్పాం.
నరేంద్ర మోదీ గారు ఆయన చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉంటున్నది.
అబద్దాలు చెబుతున్నరు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెచ్చింన్రు.
డ్రాఫ్ట్ బిల్లు రెడీ అయ్యింది. డ్రాఫ్ట్ బిల్లు చేసి రాష్ట్రాలకు కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ లేఖ రాశారు. దానికి జవాబు ప్రధానికి లేఖ రాశారు.
అదే కాకుండా తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపాం. వీటన్నింటిని మించి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో క్లియర్‌గా వాళ్ల పాలసీ చెప్పారు.
అడిషనల్ బారోఇంగ్ లింక్డ్ టూ పవర్ సెక్టార్ రిఫార్మ్స్. ఇది పార్లమెంట్‌లో వాళ్లు ఇచ్చిందే..
ఇది కేసీఆర్ స్టోరీ కాదు. అగ్రికల్చర్ సెక్టార్‌కు ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు.. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలి.
కేంద్రం పంపిన ముసాయిదా బిల్లు.
అది మెడమీద వేలాడుతున్న కత్తి. బిల్లు పాస్ కాకముందే..
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, ఈ రీఫామ్స్ చేస్తరో అడిషనల్‌గా 0.5 ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తమని ప్రకటించారు. అది ఐదేళ్లు ఇస్తమని ప్రకటించారు. పోయిన ఏడాది మనం తీసుకోలేదు.
అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తీసుకున్నది. తీసుకోవడంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారు. మిగతా వాటికి టెండర్లు పిలిచారు.
రూ.737కోట్లతో టెండర్లు పిలిచారు. 0.5శాతం అడిషనల్ ఎఫ్‌ఆర్‌బీఎం వస్తే రూ.5వేలపైచీలుకు కోట్లు వస్తయ్. రాబోయే ఐదేళ్లకు విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు ఇస్తం.. మిగిలిన రాష్ట్రాలకు ఇవ్వం.
నష్టపోయిన మంచిది నీ డబ్బులు అక్కర్లేదంటే రూ.25వేలకోట్లు నష్టపోవాలే తెలంగాణ. ఆ నష్టం ఉన్నా సరే నేను మీటర్ల పెట్టా అని చెప్పిన.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి..
ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నరు కాబట్టి నేను పెట్టా అని చెప్పిన.
శ్రీకాకుళంలో 25వేల మోటార్లకు పెట్టారు. టెండర్లు పిలిచారు..
ఇంప్లిమెంట్ చేస్తున్న రాష్ట్రాలకు ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తున్నరు.
ఇన్ని ఉండంగ.. మొన్న బడ్జెట్‌లో పెట్టారు.. ఇన్ని ఉండంగా.. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చదువు వస్తదో రాదు నాకు తెల్వదు. చదివిన కాగితం అర్థమైతదో కాదో. ఆయనను చూస్తే జాలేస్తుంది.. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్ నన్నడిగితే. ఆ పార్టీ పరువు పోతుంది
రోజు రోజుకు. ఇవన్ని ఆధారాలుండి.. ఇంత జరిగి.. రాష్ట్ర శాసనసభ తీర్మానం పాస్ చేసి పంపి.. వ్యతిరేకిస్తూ రాసిన లేఖలు ఉండి పచ్చి అబద్దం చెబుతాం.
దీనిపై బహిరంగ క్షమాపణ చెబుతా. మీటర్లు పెట్టుమన్నా..?
పెట్టుమనందే జగన్మోహన్‌రెడ్డి పెట్టిండా? శ్రీకాకుళంలా పెట్టిండా.
పెట్టుమనంతా ఎఫ్‌ఆర్‌బీఎంలా 0.5శాతం పెట్టినవా?.. దాన్ని మేం ఎందుకు తీసుకుంటలేమ్. ఎఫ్‌ఆర్‌బీఎం పవర్ రీఫామ్స్ వ్యతిరేకిస్తున్నాం కాబట్టి. ” అంటూ కేసీఆర్ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై సెటైర్లు
పాపం ఆయన్ను చూస్తే జాలేస్తోందని.. ఆయనకు బదులు వేరే వాళ్లతో మాట్లాడిస్తే బెటర్
రోజురోజుకీ బీజేపీ పార్టీ పరువు పోతుంది.
తెలంగాణలో వ్యవసాయస్థిరీకరణ జరగాలే. రైతులు ధనవంతులు కావాలి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది.
నిధులు ఇవ్వకుండా పీఎఫ్‌సీ.. ఆర్‌ఈసీపై కేంద్రమంత్రి ఆర్కే సింగ్ ఒత్తిడి తెస్తున్నారు.
మనకు ఉన్నటి వంటి నీటి ప్రాజెక్టుల్లో పీఎఫ్‌సీ ఆర్‌ఈసీ. రాష్ట్రానికి లోన్లు ఇస్తయ్. రాష్ట్రానికి మంచి డిసిప్లేయిన్ ఉంది కాబట్టి, లోన్లు రీపేమెంట్ మంచి ఉంటది కాబట్టి డబ్బులు ఇస్తరు. ఆ ఇచ్చే డబ్బులు ఆపేయమని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ పవర్ రీఫామ్స్ తెస్తలేరని ఒత్తిడి తెస్తున్నరు.. ఇదీ జరుగుతున్నది.
ఈ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తెలుస్తదా? ఎందుకు మాట్లాడుతడు ఆయన. ఇప్పుడు బహిరంగ క్షమాపణ వేడుకోవాలి.
మీడియాకు అన్ని డాక్యుమెంట్లు ఇచ్చాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను అడుగొచ్చు కదా. ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆధారాలు ఇచ్చాం దాని అర్థమేంటి.
ఒకరకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ ఉల్లంఘన. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం. పార్లమెంట్‌ను అవమానించడం.. దేశ ప్రజలను మోసం చేయడం. ఇంకా డ్రాఫ్ట్ బిల్లుగానే ఉంది. ఇది జరిగే చరిత్ర.
దీని మీద చెబితే బాధ.. అంటే బాధ. నేను ప్రధానమంత్రి అని.. పైసలు ఇస్తడి ఆశపడి మిషన్ భగీరథ ఇనాగ్రేషన్‌కు పిలిచిన. ఆయన కూడా సభలో పచ్చి అబద్దాలు చెప్పారు. ఆయన ఏం చెబుతాడన్న అంతకు ముందే మేం రూ.11 పవర్ కొన్నరు.. మేం 1.10 రూపాయలకే ఇస్తున్నం అంటున్నడు.
భారతదేశ చరిత్రలో సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నడూ ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. కానీ మేం ఇస్తున్నమని అంటే పెద్దమనిషి అని బాగుండదని ఊరుకున్నం. ఆ తర్వాత వెంటనే ఎలక్ట్రిసిటి అధికారులు అడిగితే అతిథిగా పిలిచినం తిడితే బాగుండదని ఊకున్నం. ఇట్ల ఎన్ని విషయాల్లో చెబుతరు.
నేను చాలెంజ్ చేసిన ఎవరూ మాట్లాడుతరు బీజేపీ వాళ్లు అని అన్న.. దేశంలో 4లక్షల మెగావాట్ల పవర్ ఉంది దేశంలో.. దాన్ని వాడే తెలివితేటలు లేవు ఈ కేంద్ర ప్రభుత్వానికి.. బ్యాడ్ పవర్ పాలసీ ఉందని చెప్పిన.
40వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తి సంస్థలు దేశంలో నిర్మించబడ్డయ్. పీపీఏలు అయిపోయినయ్.. ఫ్యూయల్ టైయప్ అయ్యింది. కానీ ప్రొడక్షన్ కానిస్తలేరు. ఎందువల్ల.. ఈ దేశం వల్ల. ఈ దేశం అవలంభించే దిక్కుమాలిన పవర్ పాలసీ వల్ల. చేతకాని దద్దమ్మ కేంద్ర ప్రభుత్వం వల్ల. 60శాతం దేశం పవర్ కట్స్‌లో ఉంటది. 24గంటల కరెంటు ఏరాష్ట్రంలో ఇవ్వరు ఒక తెలంగాణలో తప్పా ఇది వాస్తవం.
ఇది నిజమా? అబద్దమా?.. నేను పిచ్చి మాటలు మాట్లాడను ఆ అవసరం లేదు..
ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతా. ఇంత దుర్మార్గంగా ఆ పార్టీ వాళ్లు ప్రతి విషయంలో అబద్ధాలు, మోసాలు. దేశాన్ని సర్వనాశనం చేస్తున్నరు.
ఇవన్నింటిని మించి అఖిలభారత విద్యుత్ ఉద్యోగ సంఘాలు ఒక్కటై సమావేశాలు పెట్టాయ్. మన వద్ద మింట్ కాపాండ్‌లో మన ఉద్యోగులు ఆందోళనలు చేశారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించి, వాళ్ల పార్టీకి చెందాలు ఇచ్చే వాళ్లకు డబ్బులు ఇచ్చేటోళ్లు. వాళ్లను సాదెటోళ్లు, ఎన్నికలకు డబ్బులిచ్చిటోళ్లకు, వేలకోట్ల దిగమింగి.. వాళ్లు పెట్టే సోలార్ విద్యుత్ కొనాలని చట్టం. దానికి అందమైన పేరు చట్టం, విద్యుత్ సంస్కరణలు..
మనకు మన తెలంగాణకు జల విద్యుత్ అందుబాటులో ఉన్నది కృష్ణా నదిపై ఎక్కువ. నాగార్జునసాగర్, శ్రీశైలం, పులిచింతల, జూరాల. 2500వేల మెగావాట్ల దాగా ఉంటుంది.
గోదావరిపై తక్కువ ఉంది మనకు కృష్ణానదిపై ఎక్కువ ఉంది. ఈ దిక్కుమాలిన చట్టంలో వాళ్ల బీజేపీ మిత్రులు పెట్టే 30వేల, 40వేల మెగావాట్ల సోలార్ కొనాలట గ్రీన్ ఎనర్జీ కింద. గ్రీన్ ఎనర్జీ అయినా నాగార్జున సాగర్, శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి బంద్ పెట్టి సరే దీన్ని కొనాలి.. లేదంటే ఫైన్ వేస్తం, ఇది చట్టం.
మీ పెట్టుబడిదారుల స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలు తాకట్టుపెడుతరా? అన్ని తప్పుడు ప్రచారాలు, అబద్దాలపై ఎన్ని రోజులు నడుపుతరు భారతదేశాన్ని, ఇది ఎంత వరకు సమంజసం.
దీనిపై చర్చపెట్టండి. ఇన్ని అబద్దాలు చెప్పే వ్యక్తులను చీల్చి చెండాల్సిన బాధ్యత మీడియాపై ఉన్నది.
ఈ దేశం ఇలాగే నాశనం కావాలా? చాలా ఉంది ఇంకా భాగోతం. నేను దుఃఖంతో చెబుతున్నా.
అన్ని రంగాల్లో సర్వనాశనం ప్రతిరంగంలో.. పిచ్చి అబద్ధాలు. పచ్చి అబద్దాలు.. ఇక్కడ కాదా విదేశాల్లోనూ చెప్పుడే సిగ్గుపోతుంది.
2025 వరకు 5 ట్రిలియన్ల ఎకానమీ చేస్తాం. ఇంతకన్నా దిక్కుమాలిన దందా ఉంటదా? అది చంద్రయాన్ మీద పోయినదానితో సమానం అంటరు. మనం కూడా చంద్రమండలంపై దిగినట్టే అనుకోవాలే ఇగ.. ఇంత పచ్చి అబద్దమా.. ఇది ప్రగతా?
మోడీ ప్రభుత్వానికి దమ్ముంటే దేశాన్ని చైనాలా అభివృద్ధి చేయమనండి.
సాధారణంగా 12 శాతం గ్రోత్ ఉంటే 6 ఏండ్లలో దేశ ఎకానమీ డబుల్ అవుతుంది.
11 శాతం ఉంటే 7 ఏండ్లలో డబుల్ అవుతుంది. అది నరేంద్ర మోదీ, నిర్మలా సీతారామన్ చెప్పాల్సిన అవసరం లేదు. ఏ వడ్డీ వ్యాపారిని అడిగినా చెబుతడు.
ఇది కఠోరమైన వాస్తవం. 2025 వరకు 5 ట్రిలియన్ ఎకానమీకి తీసుకెళ్లడానికి నరేంద్ర మోదీ అవసరం లేదు.
మీకు దమ్ముంటే.. మీరు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటే.. చైనాలా అభివృద్ధి చేయండి. సింగపూర్‌లా అభివృద్ధి చేయండి.
అది చేయండి కానీ.. 5 ట్రిలియన్ ఎకానమీ కాదు. ఇది నేను చెప్పడమే కాదు.. నేను చెప్పిన విషయాన్నే చిదంబరంగారు కూడా రాజ్యసభలో చెప్పారు.
మావాళ్లు కూడా ఉన్నారు. అన్నీ గోల్ మాల్ మాటలు చెప్పి.. అబద్ధాలు చెప్పి ఎవరిని వంచించాలని అనుకుంటున్నరు. అందుకే వీళ్లను తరిమికొట్టకపోతే దేశమే నాశనం అయిపోతది.
అవసరమైతే జాతీయస్థాయిలో కొత్త పార్టీ పెడతానని కేసీఆర్ అన్నారు. (Story : మోడీపై మరోసారి కేసీఆర్ నిప్పులు)
See Also : డోసు పెంచిన కేసీఆర్