తెలంగాణ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ
బిఆర్ఎస్ ఆధ్వర్యములో ఘనంగా నివాళులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : చాకలి.ఐలమ్మ గారి 39వ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి వాకిటి.శ్రీధర్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల.అశోక్ మాట్లాడుతూ
నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వీరవనిత ఐలమ్మ అని తెలంగాణ రాష్ట్ర అవశ్యకత గుర్తెరిగి తెగువ చూపి ప్రజలను చైతన్యం చేసి ఉద్యమం నిర్మించిన వనిత ఐలమ్మ గారు అని అన్నారు. కౌన్సిలర్స్ బండారు.కృష్ణ,నాగన్న యాదవ్, ఉంగ్లం. తిరుమల్, గంధం.పరంజ్యోతి,గంధం.విజయ్, దేవర్ల.నరసింహ,నాగేంద్రమ్,ఇన్వర్టర్.పాషా,చిట్యాల.రాము,అనిల్,నయ్యూమ్ తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. (Story : తెలంగాణ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ)