UA-35385725-1 UA-35385725-1

ఏఐ ఇ-గవర్నెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వంతో మెటా భాగస్వామ్యం

ఏఐ ఇ-గవర్నెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వంతో మెటా భాగస్వామ్యం

న్యూస్‌తెలుగు/హైదరాబాద్‌: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) రంగంలో ఆవిష్కరణలను పెంపొందించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకువెళ్తూ , తెలంగాణ ప్రభుత్వంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌ (ఐటి, ఈ అండ: సి) శాఖతో రెండు సంవత్సరాల కోసం భాగస్వామ్యం చేసుకున్నట్లు మెటా తాజాగా ప్రకటించింది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇ-గవర్నెన్స్‌, పౌర సేవలను మెరుగుపరచడానికి ఏఐ వంటి తాజాగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో ప్రభుత్వ అధికారులు, పౌరులకు సాధికారత ఇస్తుంది. తాజా లామా 3.1 మోడల్‌తో సహా మెటా ఓపెన్‌-సోర్స్‌ జనరేటివ్‌ ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఇ-గవర్నెన్స్‌ సొల్యూషన్‌ల విస్తరణను వేగవంతం చేయటానికి తెలంగాణ ప్రభుత్వంకు మెటా సహకరిస్తుంది. జెన్‌ ఏఐని ఉపయోగించడం ద్వారా ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం, ఉత్పాదకత మెరుగు పడటంతో పాటు, పబ్లిక్‌ సర్వీస్‌ డెలివరీ, ఇ-గవర్నెన్స్‌ వివిధ అంశాలను మార్చడానికి ఉపయోగపడుతుంది. (Story : ఏఐ ఇ-గవర్నెన్స్‌పై తెలంగాణ ప్రభుత్వంతో మెటా భాగస్వామ్యం)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1