వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి.
ఒకటో పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్.
న్యూస్‌తెలుగు / విజయనగరం : రానున్న వినాయక చవితి ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతుల పొందాలని ఒకటో పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రానున్న వినాయక చవితి పండుగకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన సింగల్ విండో విధానానికి సంబంధించిన అనుమతులు తప్పనిసరిగా ఉత్సవాలకు సంబంధించిన కమిటీ సభ్యుల వద్ద ఉండాలన్నారు. అలాగే సంబంధిత వినాయక బొమ్మని నిలబెట్టిన మండపాలలో తప్పనిసరిగా ఒకరు లేదా ఇద్దరు సభ్యులు 24 గంటలు ఉండేలా చూసుకోవాలన్నారు. నిర్దేశించిన సమయానికి మించి మైకులు వాడ రాదన్నారు. వినాయకుని నిమజ్జనం చేసేటప్పుడు గొడవలు అల్లర్లు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత సంబంధిత సంబంధిత కమిటీ సభ్యులపై ఉంటుందన్నారు. డిజే బాక్స్ లో బాణసంచా వినియోగం నిషిద్ధమన్నారు. నిమజ్జనం సమయంలో రంగులు జల్లుకోవడం తదితర చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే తప్పనిసరిగా కేసులు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా రాత్రి 11 దాటిన తర్వాత అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావదన్నారు. వినాయక చవితి పండుగకు సంబంధించి ప్రజలందరూ తమకు సహకరించాలని కోరారు.(Story: వినాయక చవితి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి.)