వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై చర్య తీసుకోవాలి
బి. కృష్ణ
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై కలెక్టర్ చర్య తీసుకోవాలని వనపర్తి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ డిమాండ్ చేశారు. గత రెండు నెలల కిందట కమిషనర్ కు తాళ్లచెరువు వాగు నుండి రాజనగరం చెరువు వరకు వరద నీరు వస్తే ప్రమాదం జరుగుతదని, కంపచెట్లు మట్టిదిబ్బలు ఉన్నాయని తెలిపినా పట్టించుకోలేదని విమర్శించారు. అత్యవసర పనిగా భావించి హిటాచితో తొలగించాలని కోరినా కమిషనర్ స్పందించలేదన్నారు. ఆ ప్రమాదం దాపరిచిందనీ, కానీ సామాజిక సేవకుడు కృష్ణ సాగర్ టీం తో కలిసి అత్యవసరంగా వరద నీరు ముంచుకొస్తుంటే రామ టాకీస్ దగ్గర చెట్లను తొలగించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి అధికారుల పైన చర్య తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు. (story : వనపర్తి మున్సిపల్ కమిషనర్ పై చర్య తీసుకోవాలి :బి. కృష్ణ)