ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవకు అంకితం కావాలి
ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి సన్మాన సభలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : తాడిపర్తి U.P.S ప్రదానోపాద్యాయులు రాజేశ్వరి పదవీ విరమణ సన్మాన సభ స్థానిక మున్నూరు కాపు సంఘం ఫంక్షన్ హాల్ నందు జరిగింది.ఇట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. రాజేశ్వరి తన సర్వీస్ కాలంలో ఎంతో మంది విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్ది ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా కృషి చేసారు అని కొనియాడారు.వారి భర్త శ్రీనివాసులు కూడా పోస్టల్ డిపార్ట్ మెంట్ నందు సేవలు అందించినారని ఇరువురు కూడా సమాజ సేవకు అంకితం కావాలి అని అన్నారు. నిరంజన్ రెడ్డి వెంట గట్టు యాదవ్,నాగన్న యాదవ్, నందిమల్ల.అశోక్, ఉంగ్లమ్ తిరుమల్ ఉన్నారు.J.B జువెలర్స్ అధినేత రాగి.వెంకట్ గారికి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి. రాగి.వెంకట్ ప్రారంభించిన జె.బి జువేలర్స్ సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. రాగి.వెంకట్ మొదటి నుండి వ్యాపారాలు చేస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని వ్యాపారపరంగా ఇంకా వృద్ధిలోకి రావాలని కోరారు. (Story : ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవకు అంకితం కావాలి)