సెప్టెంబర్ 14న నేషనల్ లోక్ అదాలత్
న్యూస్‌తెలుగు/వినుకొండ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నందు సెప్టెంబర్ 14న నేషనల్ లోక్ అదాలత్ uకార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ న్యాయమూర్తి ఎం.ఎస్ ఎం. మహతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేషనల్ లోక్ అదాలత్ నందు రాజీ పడదగిన సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మనోవర్తి కేసులు, బ్యాంకు కేసులు, వివాహ సంబంధ వివాదాలు, ఫ్రీ లిటిగేషన్ కేసులు, రాజీ పడదగిన భూ వివాదములు, విద్యుత్, త్రాగునీరు, బ్యాంకు కేసులు, టెలిఫోన్ వివాదాలు మొదలగు కేసులను కక్ష దారులు రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అలాగే వినుకొండ న్యాయస్థానం పరిధిలోని ఎవరైనా కక్ష దారులు కేసులు రాజీమార్గంలో పరిష్కరించుకోదలచినచో నేరుగా మండల న్యాయ సేవాధికార సంస్థ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం వినుకొండ నందు నేరుగా సంప్రదించవచ్చుని న్యాయమూర్తి తెలిపారు. (Story : సెప్టెంబర్ 14న నేషనల్ లోక్ అదాలత్ )