ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త
న్యూస్ తెలుగు/అమరావతి:
ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనుకునే వారికి మరో సదవకాశం వచ్చింది. బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఏపీ ఎడ్‌సెట్`2024 కన్వీనర్ నోటిఫికేషన్ జారీజేశారు. ఏపీ ఎడ్‌సెట్-2024లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ ప్రవేశాలకు అర్హులు. రెండేళ్ల వ్యవధిగల బీఈడీ, బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్)కోర్సులను ఈ కౌన్సెలింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఈడీ కళాశాలల్లో భర్తీ చేస్తారు. బీఈడీలో మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీషు విభాగాల్లో ప్రత్యేక సబ్జెక్టులుగా చదవవచ్చు. ప్రతిభావంతుల విద్యార్థులకు బోధన కోసం బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్ )లోనే చదవాలి. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు ఈనెల 21వ తేదీనుంచి 27వరకు కొనసాగుతాయి. 22 నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది. 29వ తేదీ నుంచి సెప్టెంబరు 2వ తేదీ వరకు అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న ఆప్షన్లను 3వ తేదీన మార్పుచుకోవచ్చు. సెప్టెంబరు 5వ తేదీన సీట్లను ఖరారు చేస్తారు. వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి 5వ తేదీ నుంచి ఆయా కళాశాలల తరగతులు ప్రారంభమవుతాయి. మరోవైపు సెప్టెంబరు 7వ తేదీలోగా అభ్యర్థులు సీట్లు పొందిన కళాశాలల్లో రిపోర్టు చేయాలి. స్పెషల్ కేటగిరీ కోటాలో ఆగంగా పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, స్పోర్ట్సు, కాప్, స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులకు ఈనెల 27వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలిస్తారు. ఈ వెబ్‌కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ల నమోదుకుగాను ఓసీ, ఈసీ అభ్యర్థులు రూ.1200, ఎస్సీ,ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ.600 చొప్పున ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ అనంతరం ఆన్‌లైన్లో ఏపీ ఎడ్‌సెట్ హాల్ టిక్కెట్, ర్యాంకు కార్డు, టీసీ, డిగ్రీ మార్క్స్ మెమో, డిగ్రీ ప్రొవిజినల్ సర్టిఫికెట్, ఇంటర్ మార్క్స్ మెమో, టెన్త్ మార్క్స్ మెమో, 9 నుంచి డిగ్రీ వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం వగైరా స్కానింగ్‌చేసి అప్‌లోడ్ చేయాలి. పూరితష్ట్రÊ వివరాలను ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లోని సెట్స్ విభాగంలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నంబర్లు`8639760741, సాంకేతిక విభాగం సహాయం కోసం 91003 09338 నంబర్లను ఏపీఎడ్‌సెట్ కన్వీనర్ అందుబాటులో ఉంచారు. (Story : ఉపాధ్యాయ అభ్యర్థులకు శుభవార్త)