నల్లచెరువు కుడి ఎడమ అలుగులకు శాశ్వత పరిష్కారం చేయండి
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మండలం పరిధిలోని సూగూరు గ్రామంలో రైతుల జీవనాధారం అయినా నల్ల చెరువు కుడి ఎడమ అలుగులు గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయండంతో అట్టి విషయాన్ని కొత్త సూగూరు గ్రామ రైతులు ప్రజలు గ్రామ మాజీ సర్పంచ్ జూదం వెంకటేష్ గారి దృష్టికి తీసుకురావడంతో వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో మాట్లాడి ఘటన స్థలానికి వెళ్లి చెరువులో నీరు అధికంగా ఉన్నందున శాశ్వత పరిష్కారం చేయడం విలు కానందున రైతుల సహకారంతో తాత్కాలిక పరిష్కారం చేయడం జరిగింది. తదనంతరం ఆయకట్టు రైతులు ప్రతి ఏటా దుండగులు ఇలాగే చేస్తూ ఉంటారు కావున ఇట్టి అలుగులకు శాశ్వత పరిష్కారం చేయాలని ఇరిగేషన్ అధికారులను కోరారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జూదం వెంకటేష్ గారూ,ae కిషోర్ గారూ, jn అసిస్టెంట్ నవీన్ గారు, ముదిరాజు ప్రెసిడెంట్ పెద్ద వెంకటయ్య గారూ, సుక్క బాలస్వామి, చింతల్లయ్య,గొడుగు బాలయ్య, బాలస్వామి,గొడుగు శివన్న,ఎల్లాస్వామి, బిచ్చాన్న, తదితరులు పాల్గొన్నారు. (Story : నల్లచెరువు కుడి ఎడమ అలుగులకు శాశ్వత పరిష్కారం చేయండి)