ఈసారి ఎన్నెన్నో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్
న్యూస్‌తెలుగు/ముంబయి: 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేళ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 33వ ఎడిషన్ నివేదిక డాక్యుమెంట్ చేయబడిన కొన్ని అద్భుతమైన విజయాలు ఆకట్టుకుంటున్నాయి. క్రీడల్లో విరాట్ కోహ్లీ 2023లో 765 పరుగులతో ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు, అంతకుముందు 2003లో సచిన్ టెండూల్కర్ చేసిన 673 పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. 2022 ఆసియా గేమ్స్‌లో స్క్వాష్‌లో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణ పతకాన్ని సాధించిన తొలి జంటగా దీపికా పల్లికల్ మరియు హరీందర్ పాల్ సింగ్ సంధు నిలిచారు. అడ్వెంచర్స్‌లో మహారాష్ట్రలోని నవీ ముంబైకి చెందిన ప్రభాత్ కోలి 23 ఏళ్ల వయసులో, 1 మార్చి 2023న ఓషన్స్ సెవెన్ ఛాలెంజ్‌ని పూర్తి చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. జ్ఞాన సాధనలో, ఒక సంవత్సరంలో అత్యధిక పీహెచ్‌డీలు ప్రధానం చేసిన విశ్వవిద్యాలయంగా ఢల్లీి విశ్వవిద్యాలయం రికార్డు నెలకొల్పింది. మొదటి ప్రధాన మంత్రుల మ్యూజియంగా ప్రధానమంత్రి సంగ్రహాలయను న్యూదిల్లీలోని తీన్ మూర్తి ఎస్టేట్‌లో ఏర్పాటు చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చేరారు. ఇలా ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. (Story : ఈసారి ఎన్నెన్నో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్)