పెట్టుబడి మోసాల బారిన పడొద్దు
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
న్యూస్‌తెలుగు/ముంబయి: భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకుగా ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పెట్టుబడి అవకాశాలను ఎక్కువగా అందించే మోసపూరిత ట్రేడిరగ్ ప్లాట్‌ఫారమ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తన వినియోగదారులకు సూచించింది. వినియోగదారులను రక్షించేందుకు పెట్టుబడి మోసాలకు సంబంధించి ముందస్తుగా జాగృతిని, అవగాహనను పెంచడమే బ్యాంకు లక్ష్యాన్ని కలిగి ఉంది. పెట్టుబడి మోసాలకు పాల్పడే మోసగాళ్లు సాధారణంగా స్టాక్‌లు, ఐపీఓలు, క్రిప్టోకరెన్సీ, బిట్‌కాయిన్ తదితరాలలో పెట్టుబడి పెడితే అసాధారణంగా అధిక రాబడి వస్తుందని హామీ ఇస్తారు. ఇందులో నకిలీ ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫారమ్‌లు లేదా యాప్‌లను సృష్టించడం ద్వారా బాధితులు చేసే పెట్టుబడులపై అధిక రాబడిని సూచించే నకిలీ డాష్‌బోర్డ్‌లను వారు చూపిస్తారు. ఇటువంటి ప్లాట్‌ఫారమ్‌లు ఈ అధిక రాబడి పెట్టుబడి పథకాలలో చేరమని వ్యక్తులను ఆహ్వానిస్తూ సామాజిక మాధ్యమాలలో ప్రచారం చేసుకుంటారు. వాస్తవానికి అవన్నీ మోసపూరితమైనవే. వంచకులు సాధారణంగా సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాల ద్వారా ప్రజలను దోచుకుంటారు. అయితే, జాగ్రత్తగా ఉండటం, తగిన శ్రద్ధ తీసుకున్న అనంతరమే లావాదేవీలు చేసుకోవడం ద్వారా మోసగాళ్ల బారిన పడకుండా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుంది. (Story : పెట్టుబడి మోసాల బారిన పడొద్దు)