టయోటా ఇన్నోవా హైక్రాస్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్(ఓ) గ్రేడ్ల బుకింగ్ పున:ప్రారంభం
న్యూస్‌తెలుగు/బెంగుళూరు: ఇన్నోవా హైక్రాస్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్(ఓ) మోడళ్ల బుకింగ్‌లను తిరిగి ప్రారంభించినట్లు టయోటా కిర్లోస్కర్ మోటర్ (టీకేఎం) ప్రకటించింది. విడుదల చేసినప్పటి నుండి (నవంబర్ 2022), ఇన్నోవా హైక్రాస్ అపూర్వ స్థాయిలో కస్టమర్ స్పందనను అందుకుంది. సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వేరియంట్ (ఎస్హెచ్ఈవీ) అలాగే గ్యాసోలిన్ వేరియంట్ రెండిరటిలోనూ లభ్యమయ్యే వైవిధ్యమైన ఇన్నోవా హైక్రాస్, దాని ఆకర్షణీయత, అధునాతన సాంకేతికత, సౌలభ్యం, భద్రతా లక్షణాలు మరియు డ్రైవింగ్‌లో థ్రిల్ కోసం ఎక్కువ మంది కోరుకుంటున్నారు. అధిక డిమాండ్ పరిస్థితుల కారణంగా, టాప్ ఎండ్ గ్రేడ్ల బుకింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కాలంలో, ఇన్నోవా హైక్రాస్ ఇతర గ్రేడ్లు, హైబ్రిడ్, గ్యాసోలిన్ రెండిరటికీ బుకింగ్‌లు నిరాటంకంగా కొనసాగాయి. మెరుగైన సరఫరాతో, వెయిటింగ్ పీరియడ్ తగ్గించబడిరది. ఇన్నోవా హైక్రాస్ టాప్ ఎండ్ గ్రేడ్ల బుకింగ్‌లు ఇప్పుడు తిరిగి ప్రారంభమయ్యాయి. టీకేఎం సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ మాట్లాడుతూ ఇన్నోవా హైక్రాస్, టాప్-ఎండ్ గ్రేడ్-జెడ్ఎక్స్, జెడ్ఎక్స్ (ఓ) కోసం బుకింగ్‌ను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించినందుకు సంతోషంగా ఉందన్నారు. (Story : టయోటా ఇన్నోవా హైక్రాస్ జెడ్ఎక్స్, జెడ్ఎక్స్(ఓ) గ్రేడ్ల బుకింగ్ పున:ప్రారంభం)