UA-35385725-1 UA-35385725-1

రెండవ విడత పంట రుణ మాఫీ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

రెండవ విడత పంట రుణ మాఫీ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

న్యూస్‌తెలుగు/ వనపర్తి :రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ లో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హైదారాబాద్ లో రెండవ విడతగా 6.30 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6198 కోట్లు రుణమాఫీ ప్రకటించగా వనపర్తి జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ రుణమాఫీ నిధులు విడుదల చేసారు. ఐ .డి. ఒ.సి. సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, బ్యాంకర్లు హాజరయ్యారు. హైదారాబాద్ లో ముఖ్యమంత్రి రెండవ విడత రుణమాఫి కార్యక్రమాన్ని ఐ.డి. ఒ.సి లో ఏర్పాటుచేసిన పెద్ద టి,వి తెరల పై వీక్షించారు. ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని 16527 మంది రైతు కుటుంబాలకు రూ. 154.58 కోట్ల నిధులు రుణ మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత రుణమాఫీలో లక్ష రూపాయల వరకు జరిగిన రుణమాఫీ జిల్లాలోని 27,066 మంది రైతు కుటుంబాలకు రూ. 145.55 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
మొదటివిడతలో వివిధ కారణాల వల్ల 1140 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరించుకొని వారి ఖాతాల్లో సైతం రుణమాఫీ జమ చేయడం జరుగుతుంది అన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రెండవ విడతలో సైతం ఆధార్ కార్డులో పేరుకు బ్యాంకు లో ఉన్న పేరుకు తేడా ఉండటం లేదా అకౌట్ నెంబరు సరిగ్గా రాయకపోవడం వంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరికైనా రుణమాఫీ రాని పక్షంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08545-220351 లేదా 08545-233525 కు ఫోన్ చేయవచ్చు అని తెలియజేశారు.
ఇప్పుడు విడుదల చేసిన నిధులను రైతుల ఖాతాకు త్వరగా జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సూచించారు.
ఇంత పెద్దమొత్తంలో జరుగుచున్న రుణ మాఫీ కార్యక్రమాన్ని రైతులు అందరూ ఒకచోట గుమికూడి సంబరాలు చేసుకునే విధంగా జిల్లాలోని రైతు వేదికల్లో టి.వి తెరలు ఏర్పాటు చేశారు.
ఉదయాన్నే జిల్లా కలెక్టర్ పెద్దమందడి మండలంలోసి మణిగిల్ల గ్రామ శివారులో జరుగుచున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పెద్దమందడి, నాగవరం రైతివేదికల్లో రుణమాఫీ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు ఏర్పాటు చేసిన టి వి తెరల ఏర్పాట్లు పరిశీలించారు. రైతులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒకేసారి ఇంత భారీస్థాయిలో రుణమాఫీ జరగటంతో వనపర్తి జిల్లా రైతు కుటుంబాల ఇళ్ళల్లో పండగ వాతావరణం ఏర్పడింది.
రెండవ విడత పంట రుణ మాఫీ సందర్భంగా వనపర్తి జిల్లాలో 16527 రైతు కుటుంబాలకు రూ. 154.58 కోట్ల నిధులు విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ లో భాగంగా మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి హైదారాబాద్ లో రెండవ విడతగా 6.30 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6198 కోట్లు రుణమాఫీ ప్రకటించగా వనపర్తి జిల్లా రైతులకు జిల్లా కలెక్టర్ రుణమాఫీ నిధులు విడుదల చేసారు.
ఐ .డి. ఒ.సి. సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అధ్యక్షత వహించగా వ్యవసాయ శాఖ అధికారులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, బ్యాంకర్లు హాజరయ్యారు. హైదారాబాద్ లో ముఖ్యమంత్రి రెండవ విడత రుణమాఫి కార్యక్రమాన్ని ఐ.డి. ఒ.సి లో ఏర్పాటుచేసిన పెద్ద టి,వి తెరల పై వీక్షించారు.
ముఖ్యమంత్రి ప్రకటన అనంతరం జిల్లా కలెక్టర్ వనపర్తి జిల్లాలోని 16527 మంది రైతు కుటుంబాలకు రూ. 154.58 కోట్ల నిధులు రుణ మాఫీ చేస్తూ నిధులు విడుదల చేసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి విడత రుణమాఫీలో లక్ష రూపాయల వరకు జరిగిన రుణమాఫీ జిల్లాలోని 27,066 మంది రైతు కుటుంబాలకు రూ. 145.55 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు.
మొదటివిడతలో వివిధ కారణాల వల్ల 1140 మంది రైతులకు రుణమాఫీ జరగలేదు అన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరించుకొని వారి ఖాతాల్లో సైతం రుణమాఫీ జమ చేయడం జరుగుతుంది అన్నారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రెండవ విడతలో సైతం ఆధార్ కార్డులో పేరుకు బ్యాంకు లో ఉన్న పేరుకు తేడా ఉండటం లేదా అకౌట్ నెంబరు సరిగ్గా రాయకపోవడం వంటి చిన్న చిన్న సమస్యల వల్ల ఎవరికైనా రుణమాఫీ రాని పక్షంలో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నెంబర్ 08545-220351 లేదా 08545-233525 కు ఫోన్ చేయవచ్చు అని తెలియజేశారు.
ఇప్పుడు విడుదల చేసిన నిధులను రైతుల ఖాతాకు త్వరగా జమ చేసేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సూచించారు.
ఇంత పెద్దమొత్తంలో జరుగుచున్న రుణ మాఫీ కార్యక్రమాన్ని రైతులు అందరూ ఒకచోట గుమికూడి సంబరాలు చేసుకునే విధంగా జిల్లాలోని రైతు వేదికల్లో టి.వి తెరలు ఏర్పాటు చేశారు.
ఉదయాన్నే జిల్లా కలెక్టర్ పెద్దమందడి మండలంలోసి మణిగిల్ల గ్రామ శివారులో జరుగుచున్న క్రాప్ బుకింగ్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం పెద్దమందడి, నాగవరం రైతివేదికల్లో రుణమాఫీ కార్యక్రమాన్ని రైతులు వీక్షించేందుకు ఏర్పాటు చేసిన టి వి తెరల ఏర్పాట్లు పరిశీలించారు. రైతులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఒకేసారి ఇంత భారీస్థాయిలో రుణమాఫీ జరగటంతో వనపర్తి జిల్లా రైతు కుటుంబాల ఇళ్ళల్లో పండగ వాతావరణం ఏర్పడింది.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మెంచు నగేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ కౌశల్ కిషోర్, ప్యాక్స్ చైర్మన్లు, బ్యాంకర్లు, మండల వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ విస్తిర్ణాధికారులు, రైతులు పాల్గొన్నారు. (Story : రెండవ విడత పంట రుణ మాఫీ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
UA-35385725-1