ఇదీ ఒక బడ్జెట్టేనా?
కేంద్ర బడ్జెట్‌పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
న్యూస్‌తెలుగు/అమరావతి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అచ్చం ఎన్నికల మ్యానిఫెస్టోలా ఉందని, దీన్ని ఎవరైనా బడ్జెట్ అని పిలుస్తారా అని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం ఆమె బడ్జెట్‌పై స్పందించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఆమె మాటల్లోనే…
– ఇది బడ్జెట్ కాదు
– ఎన్నికల మ్యానిఫెస్టో
– ఏది పడితే అది చెప్పొచ్చు
– ఏదైనా హామీ ఇవ్వొచ్చు
– బడ్జెట్ అంటే అంకెలు ఉండాలి. కాలపరిమితి ఉండాలి
– ఇది పూర్తిగా మ్యానిఫెస్టో
– చంద్రబాబు లక్ష కోట్లు కావాలని అడిగాడు
– ఏపి కి దాదాపు 12 లక్షల కోట్లు కావాల్సి ఉంది
– కానీ బాబు అడిగింది కేవలం 1 లక్ష కోట్లు మాత్రమే
– 5 ఏళ్లకు 5 లక్షల కోట్లు ఎలా సరిపోతాయి తెలియదు
– బడ్జెట్ లో కేవలం రాజధానికి నిధులు ఇస్తామని చెప్పారు
– పోలవరం మీద ఎన్నో కబుర్లు చెప్పారు
– లైఫ్ లైన్ అన్నారు.. ఫుడ్ సేఫ్టీ అన్నారు
– ఇంత లైఫ్ లైన్ అయితే పోలవరం కి ఎన్ని నిధులు ఇచ్చారు ?
– పోలవరం ప్రాజెక్టు కాస్ట్ ఎంతో తెలియదు
– 12 వేల కోట్లు రీహాబిలిటేషన్ కి కావాలి
– ముఖ్యమైన ప్రాజెక్టు అయితే నిధులు ఎంత ఇస్తారు అని ఎందుకు చెప్పలేదు ?
– ఓర్వకల్, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్ కి ఎంత నిధులు ఇస్తారు ?
– హామీలు ఇస్తే సరిపోతుందా ?
– 500 కోట్లు ఇస్తారా ? 5 వేల కోట్లు ఇస్తారా ?
– బడ్జెట్ అంటే అంకెలకు సంబంధించిన విషయం
– కానీ ఈ బడ్జెట్ లో కబుర్లు మాత్రమే చెప్పారు
– వెనకబడిన ప్రాంతాలకు గ్రాంట్స్ అన్నారు
– ఎప్పుడు ? ఎంత అనేది క్లారిటీ లేదు
– కనీసం బాబుకి అయినా క్లారిటీ ఉందా ?
– ఇది పూర్తిగా బిజెపి మ్యానిఫెస్టో
– అసలు మానేసి కొసరు అన్నట్లు ఉంది
– ప్రత్యేక హోదా అనే అంశం ఊసే లేదు
– విభజన హక్కులను గౌరవిస్తాం అన్నారు
– విభజనలో మొదటి అంశం హోదా
– అసలు విషయం పక్కన పెట్టి,ఇతర విషయాలు ఇస్తాం అంటున్నారు
– మోడీ తిరుపతి లో 10 ఏళ్లు హోదా అని మాట ఇచ్చారు
– ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటే మాట తప్పినట్లా ?
– పార్లమెంట్ వేదికగా ఇక హోదా లేదు అని అప్రోవ్ అయ్యింది
– ప్రత్యేక ప్యాకేజీలు అంటున్నారు కానీ…హోదా మీద చెప్పడం లేదు
– ఇచ్చిన హామీలు కూడా క్లారిటీ లేదు
– బీహార్ కి హోదా లేదు అని చెప్పారు
– బీహార్ కి హోదా ఇస్తామని ఎవరు మాట ఇవ్వలేదు
– బీహార్ కి హోదా అని పార్లమెంట్ లో హామీ ఇవ్వలేదు
– కానీ ఏపి విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పింది
– హోదా నే ఏపి కి సంజీవని
– హోదా వస్తేనే రాష్ట్ర అభివృద్ధి
– హోదా వస్తే ఇండస్ట్రీలు వస్తాయి
– కేంద్ర సంస్థల స్థాపన కూడా ప్రస్తావన లేదు
– కేవలం 15 వేల కోట్లకు పండుగ చేసుకోవాలా ?
– బీహార్ 12 మంది ఎంపీలు ఇస్తే 26 వేల కోట్లు ఇచ్చారు
– ఇక్కడ 25 మంది ఎంపీలను తీసుకొని ముష్టి వేస్తున్నారా ?
– చంద్రబాబు సమాధానం చెప్పాలి
– బిజెపి మళ్ళీ మోసం చేస్తుంది అని గమనించాలి
– ఒక్కో ఎంపీకి 1 వెయ్యి కోట్ల చొప్పున 15 వేల కోట్లు ఇచ్చి కొనుక్కున్నట్లు ఇచ్చారా?
– విశాఖ రైల్వే జొన్ ఊసే లేదు
– విశాఖ,విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టు కావాలి
– 2022 కల్లా దేశం మొత్తం పక్కా ఇండ్లు అన్నారు
– ఇప్పుడు మళ్ళీ మూడు కోట్ల ఇండ్లు అంటున్నారు
– గత 10 ఏళ్లుగా ఆంధ్రను మోసం చేస్తూనే ఉన్నారు
– మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నారు
– లక్ష కోట్లు అడిగితే 15 వేల కోట్లు ఇచ్చారు
– మోడీ మళ్ళీ మోసం చేశారు అని బాబు ధైర్యంగా చెప్పగలరా ?
– ఈ బడ్జెట్ హర్శించేది కాదు
– బాబు గారు కళ్ళు తెరవండి
– బిజెపితో మద్దతు ఉపసంహరించుకోండి
– వినుకొండ హత్యా పై నేను విచారణ చేశా అని చెప్పలేదు
– న్యూట్రల్ మీడియా ను అడిగా అని చెప్పా
– వాళ్ళు చెప్పిన సమాధానమే నేను మీడియా కి చెప్పా
– ఇద్దరు గతంలో వైసిపి లో ఉన్నారు
– అప్పుడే విబేధాలు ఉన్నాయి
– అప్పుడే కేసులు పెట్టుకున్నారు
– జైల్లో కూడా పెట్టుకున్నారు
– ఇండ్లమీదకు గొడవలుకు వెళ్ళారు
– వైసిపి నేతలు పంచాయితీ కూడా చేశారు
– అందుకే మేము ఇద్దరి మధ్య పొలిటికల్ కాదు అన్నాను
– ఇది పొలిటికల్ మర్డర్ కాదు అని చెప్పాను
– పొలిటికల్ మర్డర్ కానప్పుడు డిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు ?
– రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కరోజైనా ధర్నా చేశాడా ?
– ఇది జాతీయ సమస్య అయినట్లు డిల్లి వరకు ధర్నా ఎందుకు చేస్తున్నారు ?
– కడప స్టీల్ మీద ఒక్క రోజైనా ధర్నా చేశారా ?
– అసెంబ్లీ జరుగుతుంది
– లాండ్ టైటిల్ యాక్ట్ జరుగుతుంది
– మీరు తెచ్చిన చట్టం మీద ఎందుకు చర్చ చేయడం లేదు ?
– మీకు మెదడు లేదని అర్థం అయింది.
…అని షర్మిల కేంద్ర బడ్జెట్‌పై దుమ్మెత్తిపోశారు. (Story: ఇదీ ఒక బడ్జెట్టేనా?)