పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది
న్యూస్‌తెలుగు/ కొమురం భీం అసిఫాబాద్ జిల్లా : పోలీస్ కార్యాలయంలో పదోన్నతి పొందిన పలువురు జిల్లా పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ అభినందించారు. ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతి తో ఉద్యోగం పట్ల మరింత బాధ్యత పెరుగుతుందని తెలియజేశారు. ఇదేవిధంగా క్రమశిక్షణతో విధులు నిర్వర్తిస్తూ సర్వీస్ లో మరిన్ని పదోన్నతులు పొందుతూ జిల్లాకు వ్యక్తిగతంగా మంచి పేరు తెచ్చుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.
పదోన్నతులు పొందిన వారి వివరాలు..మహమ్మద్ బషీరుద్దీన్,గులాం మక్సుద్ అహ్మద్ హెడ్ కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ గా నాగరాజు, తిరుపతి కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతులు పొందారు.మహమ్మద్ బషీరుద్దీన్ 2019లో తెలంగాణ హైకోర్టులో అసిఫాబాద్ జిల్లా తరపున కోర్ట్ లిజనింగ్ ఆఫీసర్ గా రెండు సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత జిల్లాలో అసిఫాబాద్ డిస్ట్రిక్ కోర్ట్ అసిఫాబాద్ డివిజన్ లిజనింగ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ 15 కేసులలో 20 మంది నేరస్తులకు జీవిత కారాగార శిక్ష పడేవిధంగా కృషి చేసినందుకు గాను వారికి ప్రశంసా పత్రం పొందారు.ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ టౌన్ సిఐ సతీష్, కాగజ్నగర్ రూరల్ సిఐ రాంబాబు, ఆర్ ఐ అడ్మిన్ పెద్దయ్య, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు ఎంవీఎస్ రెడ్డి మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. (Story : పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుంది)