Homeవార్తలుగ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా కొత్త సీఈఓగా సంజయ్‌ ఎనిశెట్టి

గ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా కొత్త సీఈఓగా సంజయ్‌ ఎనిశెట్టి

గ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా కొత్త సీఈఓగా సంజయ్‌ ఎనిశెట్టి

న్యూస్‌తెలుగు/ముంబయి : నేచురల్‌ సలోన్‌గా ప్రసిద్ధి చెందిన గ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా, తమ కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా సంజయ్‌ ఎనిశెట్టిని నియమించుకున్నట్లు వెల్లడిరచింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎనిశెట్టి పెట్టుబడులు, స్టార్టప్‌ రంగంలో 18 సంవత్సరాలకు పైగా విస్తృతమైన పరిజ్ఞానం, ప్రయోగాత్మక అనుభవం కలిగిన నిపుణులు. ఈ నియామకం గురించి నేచురల్స్‌ సెలూన్స్‌ సహ వ్యవస్థాపకుడు, సిఎండి సి కె కుమారవేల్‌ మాట్లాడుతూ, వెంచర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌లలో 18 సంవత్సరాల అనుభవాన్ని సంజయ్‌ కలిగి ఉన్నారు. గత 7 నుండి 8 సంవత్సరాలుగా అతని గురించి తెలుసు, నేను అతని సామర్థ్యాన్ని ప్రత్యక్షగా చూశానన్నారు. నూతన సీఈఓ సంజయ్‌ ఎనిశెట్టి మాట్లాడుతూ నేను నేచురల్స్‌ టీమ్‌లో చేరినందుకు ఆనందంగా ఉందన్నారు. (Story : గ్రూమ్‌ ఇండియా సలోన్‌ అండ్‌ స్పా కొత్త సీఈఓగా సంజయ్‌ ఎనిశెట్టి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!