విప్లవాత్మక క్యాన్సర్ చికిత్సను తీసుకువచ్చిన సన్ యాక్ట్
న్యూస్‌తెలుగు/ముంబై/థానే : భారతదేశంలో ఒక మైలురాయిగా చెప్పబడుతున్న అత్యాధునిక సాంకేతికత, వినూత్న క్యాన్సర్ చికిత్సను అందిస్తూ సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు భారతదేశంలో తమ కార్యకలాపాలు ప్రారంభించింది. అంతర్జాతీయంగా అయ్యే ఖర్చుతో పోలిస్తే నామమాత్రపు ఖర్చుతోనే చికిత్స అందించే సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌ని మహిమా చౌదరి (నటి, క్యాన్సర్ విజేత) 2024 జూలై 20న థానే (ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం)లోని టైటెన్ మెడిసిటీ హాస్పిటల్ భవనంలోని 4వ అంతస్తులో ప్రారంభించారు. జీఎంపీ మాడ్యులర్ యూనిట్‌తో కూడిన భారతదేశపు మొట్టమొదటి సూపర్-స్పెషలైజ్డ్ క్యాన్సర్ క్లినిక్ (ప్రసిద్ధ మెడికల్ ఆంకాలజిస్ట్, ప్రొఫెసర్ డా. విజయ్ పాటిల్, ఆంకాలజిస్ట్ డా. ఆశయ్ కర్పే నేతృత్వంలో దీనిని ఏర్పాటు చేసారు) ఇది. డాక్టర్ విజయ్ పాటిల్ చెప్పినట్లుగా సన్ యాక్ట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వినూత్న పరిశోధనలు, అత్యాధునిక సాంకేతికతలు, విప్లవాత్మక చికిత్సలు మరియు వ్యక్తిగతీకరించిన రోగుల సంరక్షణ ద్వారా భారతదేశంలో క్యాన్సర్ చికిత్సను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉంది. థానేలోని ఈ క్లినిక్ ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటిసారిగా అలోజెనిక్ కార్ -టి సెల్ థెరపీని అందిస్తోంది. ( Story : విప్లవాత్మక క్యాన్సర్ చికిత్సను తీసుకువచ్చిన సన్ యాక్ట్)

