ములుగు జిల్లా వైద్యాధికారి సాహస యాత్ర
పెనుగోలు గిరిజనులకు వైద్య పరీక్షలు
18 కిలోమీటర్లు కాలినడకన 3 వాగులు 4 గుట్టలు దాటి వైద్య సేవలు
న్యూస్‌తెలుగు/ములుగు : ములుగు జిల్లా వైద్యాధికారి డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య సాహస యాత్ర చేశారు. వాజేడు మండల పరిధిలోని కీకరారణ్యం లో ఉన్న పెనుగోలు గ్రామానికి 18 కిలోమీటర్లు 3 వాగులు,4 గుట్టలు ఎక్కి దిగి అక్కడ ఉన్న పది కుటుంబాల గిరిజనులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సాహసోపేతంగా పెనుగోలు చేరుకున్న వైద్య బృందం అక్కడి గిరిజనులకు డెంగ్యూ, మలేరియా టెస్టులను నిర్వహించారు. అందులో ఇద్దరికీ మలేరియా పాజిటివ్ రావడంతో వారికి మందులను అందించారు.వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ఆస్కారం ఉండడంతో తీసుకోవలసిన జాగ్రత్తలను పెనుగోలు గిరిజనులకు వివరించారు. అదేవిధంగా 30 దోమతెరలను వారికి అందించారు. వర్షాకాలం నిత్యవసరాలకు పెనుగోలు గిరిజనులు ఇబ్బంది పడకుండా నూనెలు, పప్పులుమొదలగు నిత్యవసరాలను వారికి అందించారు. ఆయన వెంట వాజేడు వైద్యాధికారి డాక్టర్ మహేందర్, హెల్త్ అసిస్టెంట్ చిన్నతదితరులు పాల్గొన్నారు.(Story :ములుగు జిల్లా వైద్యాధికారి సాహస యాత్ర)