నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం
న్యూస్తెలుగు/చింతూరు: పోలవరం నిర్వాసితుల సమస్యలపై గళమెత్తిన చింతూరు నూతన ఎంపీపీ చిచ్చడి మురళి. పోలవరం పరిహారం ఎవరో జాలిపడి ఇచ్చేది కాదని.. అది నిర్వాసితుల హక్కు అని స్పష్టం చేశారు.
చింతూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీటీసీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. మండలంలోని మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 స్థానాలను వైసీపీ కైవసం చేసుకోగా, చింతూరు-2 నుంచి గెలుపొందిన చిచ్చడి మురళిని ఎంపీపీగా, వైస్ ఎంపీపీ గా లేలి భద్రయ్య ను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించిన చిచ్చడి మురళి తనను గెలిపించిన ప్రజలకు, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని హామీ ఇచ్చారు. అనంతరం పోలవరం నిర్వాసితుల పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ప్రభుత్వం నిర్వాసితులకు రూ.10 లక్షల 50 వేల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తామని చెప్పిందని, ప్రస్తుతం రూ.6 లక్షల 50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పరిహారం డబ్బులు ఖాతాల్లో పడుతున్నాయనే సంతోషంలో తమకు రావాల్సిన అసలు పరిహారం ఎంత అనే విషయాన్ని నిర్వాసితులు మర్చిపోవద్దని సూచించారు.
తాతల ముత్తాతల నుంచి నివసించిన పుట్టినిల్లు, పుట్టినగడ్డను వదిలి కొత్త ప్రాంతాలకు వెళ్లి జీవించాల్సిన పరిస్థితి నిర్వాసితులదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇస్తున్న పరిహారం వారి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందా? ఆ మొత్తంతో కొత్త జీవితాన్ని నిర్మించుకోగలరా? అని ప్రభుత్వాలు ఆలోచించాలని కోరారు.
అంతేకాకుండా ఇళ్ల స్ట్రక్చర్ వాల్యుయేషన్కు మూడు రెట్లు పరిహారం చెల్లించాల్సి ఉండగా, అరకొరగా, అవకతవకలతో తక్కువ మొత్తాలు చెల్లించారని ఆరోపించారు.2022 కటాఫ్ నిబంధనతో సంబంధం లేకుండా నిర్వాసితులు ఖాళీ చేసే సమయానికి 18 ఏళ్లు నిండిన ప్రతి యువతీ, యువకుడికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పరిహారం కోసం ఎదురుచూస్తూ మరణించిన నిర్వాసితుల కుటుంబాలకు కూడా రావాల్సిన పరిహారం నిలిపివేయకుండా చెల్లించాలని కోరారు.అత్యంత కీలకంగా నిర్వాసితులకు పునరావాసం వారు కోరుకున్న ప్రాంతంలోనే కల్పించాలని, అధికారులు తమ ఇష్టానుసారం ప్రాంతాలను నిర్ణయించడం సరికాదని స్పష్టం చేశారు. (Story: నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

