భారతదేశంలో ఆడియోబుక్‌లను పరిచయం చేసిన స్పాటిఫై: సంగీతం, పాడ్‌కాస్ట్‌లకు మించి తన ఆడియో సేవల విస్తరణ
నేటి నుంచి, 3,50,000కు పైగా ఆంగ్ల ఆడియోబుక్ శీర్షికలు, భారతీయ భాషల్లో మరో 7,000 ఆడియోబుక్‌లు మీకు ఇష్టమైన పాటలు, పాడ్‌కాస్ట్‌లతో పాటు అందుబాటులో ఉంటాయి. రానున్న రోజుల్లో మరిన్ని కథలు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి.
ముంబై, 17 నవంబర్ 2026: లోకల్ ట్రైన్ ప్రయాణంలో ఓ థ్రిల్లర్ కథ, ఉదయం నడకలో ఓ జ్ఞాపకాల పుస్తకం, పడుకునే ముందు ఓ ఫిలాసఫీ పుస్తకం… ఇకపై ఇవన్నీ స్పాటిఫైలోనే ఆస్వాదించవచ్చు. నేటి నుంచి స్పాటిఫై ఆడియోబుక్‌లను భారతదేశంలో అందుబాటులోకి తీసుకొస్తోంది. దీంతో మీకు ఇష్టమైన సంగీతం, పాడ్‌కాస్ట్‌లు, పుస్తకాలు అన్నీ ఒకే చోట లభించనున్నాయి.
భారతదేశంలో కథలు వినే సంప్రదాయం ఎప్పటినుంచో ఉంది. మన ఇతిహాసాలు తరతరాలుగా మౌఖికంగా వ్యాప్తి చెందాయి. తాతామామ్మలు నిద్రపోయే ముందు పిల్లలకు కథలు చెప్పేవారు. నేటి తరం, పాడ్‌కాస్ట్‌లను తమ రోజువారీ జీవితంలో భాగం చేసుకుంది. ఇప్పుడు స్పాటిఫై ఆడియోబుక్లతో ఈ సంప్రదాయానికి మరో కొత్త అధ్యాయం జోడిస్తోంది. ఆడియోబుక్స్+ ప్లాన్‌తో శ్రోతలు ప్రతి నెలా 15 గంటల పాటు ఆడియోబుక్‌లను వినవచ్చు. అదనపు చెల్లింపుతో వినే సమయాన్ని పెంచుకోవచ్చు లేదా ఒక్కో పుస్తకాన్ని విడిగా కొనుగోలు చేయవచ్చు. క్లాసిక్ రచనలు, విశేష ఆదరణ పొందిన పుస్తకాలు, కొత్తగా పరిచయమయ్యే రచనలతో కూడిన విస్తృతమైన కేటలాగ్‌లోని ఆడియోబుక్‌లు, వారికి ఇష్టమైన సంగీతం, పాడ్‌కాస్ట్‌లతో పాటు అందుబాటులో ఉంటాయి.
అమర్జిత్ సింగ్ బాత్రా, జీఎం సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మరియు ఎండీ, స్పాటిఫై, ఇండియా మాట్లాడుతూ, “భారతదేశంలో కథలను చదవడం ఎంత సహజమో, వినడం కూడా అంతే సహజమైన సంప్రదాయం. స్పాటిఫైలో ఆడియోబుక్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా, మా శ్రోతలు ఇప్పటికే ఆస్వాదిస్తున్న సంగీతం, పాడ్‌కాస్ట్‌లతో పాటు పుస్తకాలను కూడా ఒకే వేదికపై అందిస్తున్నాము. భారతీయ శ్రోతలు తమకు నచ్చిన తదుపరి పుస్తకాన్ని సులభంగా కనుగొనేలా చేయడంతో పాటు, ‘స్పాటిఫై ఫర్ ఆథర్స్’ ద్వారా స్వతంత్ర రచయితలు, స్వయంగా పుస్తకాలను ప్రచురించే రచయితలు సహా భారతీయ రచయితలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మరింత మంది పాఠకులు, శ్రోతలను చేరుకునేందుకు తోడ్పడటం మా లక్ష్యం,” అని అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కూడా ఆడియోబుక్లకు ఆదరణ పెరుగుతోంది. స్పాటిఫైలో నెలవారీ ఆడియోబుక్ శ్రోతల సంఖ్య ఏటా సుమారు 40% పెరగగా, ఆడియోబుక్‌లు వినే మొత్తం గంటలు 30% కంటే ఎక్కువగా పెరిగాయి. అమెరికాలో స్పాటిఫై ద్వారా ఆడియోబుక్‌లు వినే వారిలో 18–34 ఏళ్ల వయస్సు గలవారు 57% ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 మంది ప్రచురణకర్తలు, 50,000 మందికి పైగా రచయితల నుంచి 8 లక్షలకు పైగా ఆడియోబుక్‌లను స్పాటిఫై అందిస్తోంది.
భారతీయ శ్రోతలకు అందుబాటులో ఉండే ప్రత్యేకతలు
- భారతీయ శ్రోతల అభిరుచులకు అనుగుణమైన కేటలాగ్: ప్రారంభ దశలోనే 3,50,000కు పైగా ఆంగ్ల ఆడియోబుక్‌లు, దాదాపు 7,000 భారతీయ భాషల ఆడియోబుక్‌లను వినే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన బెస్ట్ సెల్లర్లతో పాటు భారతీయ రచయితల రచనలు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి. హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠీ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లోని విభిన్న ప్రాంతీయ కథలు, సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రేమ్‌చంద్ రచించిన గోదాన్, కల్కి రచించిన పొన్నియిన్ సెల్వన్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన కాబూలీవాలా వంటి సాహిత్య రత్నాలతో పాటు, ధర్మవీర్ భారతి రచించిన గునాహోం కా దేవతా, అమీ గణాత్రా రచించిన మహాభారత అన్రావెల్డ్ వంటి ప్రసిద్ధ రచనలు కూడా ఈ సమాహారంలో ఉన్నాయి.
- మీకు నచ్చినట్లు అన్వేషించుకునే వెసులుబాటుతో ధరలు: నెలకు ₹199 చెల్లించి, ఉచిత (Free) లేదా ప్రీమియం (Premium) ప్లాన్‌లో ఉన్నప్పటికీ, ఆడియోబుక్స్+ ద్వారా మొత్తం కేటలాగ్‌లోని పుస్తకాలను 15 గంటల పాటు వినవచ్చు. ఈ సమయాన్ని ఎలా వినియోగించుకోవాలన్నది పూర్తిగా మీ ఇష్టం. ఒకేసారి పలు పుస్తకాలను వినవచ్చు, కొన్ని అధ్యాయాలను ముందుగా వినవచ్చు, కొత్త జానర్‌ను అన్వేషించవచ్చు లేదా ఆసక్తి కలిగినప్పుడు కొత్త పుస్తకాన్ని ప్రారంభించవచ్చు. మరింత సమయం కావాలంటే అదనపు వినే గంటలను కొనుగోలు చేయవచ్చు లేదా నచ్చిన పుస్తకాలను విడిగా కొనుగోలు చేయవచ్చు. నేటి నుంచే మీ స్పాటిఫై యాప్‌లో ఆడియోబుక్స్+ ద్వారా వినడం ప్రారంభించండి. మరిన్ని వివరాల కోసం ఈ హబ్‌ను సందర్శించండి.
- మీ అభిరుచులను తగిన సిఫార్సులు: మీకు నచ్చే తదుపరి పుస్తకం, మీకు నచ్చే తదుపరి సంగీత కళాకారుడిని స్పాటిఫై పరిచయం చేసినట్లుగానే మీ ముందుకు వస్తుంది. మీ అభిరుచులకు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన సిఫార్సులు, ఆడియోబుక్ చార్ట్‌ల ద్వారా కొత్త పుస్తకాలను కనుగొనవచ్చు. థ్రిల్లర్లు, మిస్టరీలు, ప్రేమకథలు, స్వీయ అభివృద్ధి పుస్తకాలు, ఫాంటసీ కథలు… ప్రతి మూడ్‌కు తగిన కథ ఇక్కడ ఉంటుంది.
- మీరు చదివిన చోటును గుర్తించే పేజ్ మ్యాచ్ (Page Match): మీ చేతిలో ఉన్న పుస్తకంలోని ISBN బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే, స్పాటిఫై అదే పేజీకి సంబంధించిన ఆడియోబుక్‌ను ప్రారంభిస్తుంది. దీంతో మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచే కథను వినడం కొనసాగించవచ్చు. ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా వినియోగదారులు పేజ్ మ్యాచ్‌ను ఉపయోగించారు.
- ఆఫ్లైన్లోనూ వినే సదుపాయం: సంగీతం, పాడ్కాస్ట్ల మాదిరిగానే ఆడియోబుక్‌లను కూడా డౌన్లోడ్ చేసుకుని, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే వినవచ్చు.
- స్లీప్ టైమర్ సదుపాయం: కథ వింటూ నిద్రలోకి జారుకోవచ్చు. మీరు నిద్రపోయే సమయానికి ఆడియోబుక్ ఆటోమేటిక్‌గా ఆగిపోయేలా స్లీప్ టైమర్‌ను సెట్ చేసుకోవచ్చు.
భారతదేశంలోనూ అందుబాటులోకి వచ్చిన ‘స్పాటిఫై ఫర్ ఆథర్స్’
ఈ ప్రారంభంతో, భారతదేశంలోని రచయితలకు కూడా ‘స్పాటిఫై ఫర్ ఆథర్స్’ సేవ అందుబాటులోకి వచ్చింది. స్వతంత్ర రచయితలు, స్వయంగా తమ పుస్తకాలను ప్రచురించే రచయితలు తమ ఆడియోబుక్‌లను స్పాటిఫైలో పంపిణీ చేయవచ్చు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా తమ ఆడియోబుక్‌లను వినే శ్రోతలకు సంబంధించిన గణాంకాలు, సమాచారాన్ని తెలుసుకోవచ్చు. రిడెంప్షన్ కోడ్లతో సహా వివిధ మార్కెటింగ్ సాధనాలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ భాగస్వామ్యం ప్రత్యేకమైనది కాదు. కాబట్టి, రచయితలు తమ రచనలను ఇతర ప్లాట్‌ఫారమ్‌లలోనూ స్వేచ్ఛగా పంపిణీ చేసుకోవచ్చు.
ప్రారంభించడం ఎలా:
- స్పాటిఫై యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్డేట్ చేసి, ‘ఆడియోబుక్స్’ (Audiobooks) విభాగానికి వెళ్లండి లేదా ఏదైనా పుస్తకం కోసం వెతకండి.
- ఒక పుస్తకాన్ని ఎంచుకుని, ‘Audiobooks+’ని జోడించండి.
- మీ ప్లాన్‌ను [spotify.com/account లేదా http://spotify.com/audiobooks]లో నిర్వహించుకోవచ్చు.
- ‘ప్లే’ (Play) బటన్‌ను నొక్కండి. (Story: ఆడియోబుక్‌లను పరిచయం చేసిన స్పాటిఫై)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

