ఐడీబీఐ బ్యాంక్ ‘ఐడీబీఐ ఇన్నోవేట్ 2026’ గ్రాండ్ ఫినాలే విజయవంతం
ముంబై, నవంబర్ 2026: ఐడీబీఐ బ్యాంక్ ప్రతిష్టాత్మక హ్యాకాథాన్ వేదిక అయిన ‘ఐడీబీఐ ఇన్నోవేట్ 2026′(IDBI Innovate 2026) గ్రాండ్ ఫినాలేను విజయవంతంగా ముగించింది. బ్యాంకింగ్ రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడం, ఫిన్‌టెక్ రంగంతో కలిసి పనిచేయడం మరియు డిజిటల్ సేవల పరివర్తనను వేగవంతం చేయడంలో తన నిబద్ధతను ఈ వేడుక మరింత బలపరిచింది.
“బిల్డ్. ఇంటిగ్రేట్. ట్రాన్స్‌ఫార్మ్.”(Build. Integrate. Transform) అనే థీమ్‌తో నిర్వహించిన ఈ హ్యాకాథాన్… స్టార్టప్‌లు, ఫిన్‌టెక్ సంస్థలు, ఉద్యోగులు మరియు నూతన ఆవిష్కర్తలకు ఒక చక్కని వేదికను అందించింది. బ్యాంకింగ్ రంగంలోని ప్రధాన వ్యాపార మరియు కార్యాచరణ సవాళ్లను ఎదుర్కొనేలా సురక్షితమైన, విస్తరించదగిన (స్కేలబుల్), కస్టమర్-కేంద్రీకృత పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడింది. ఈ కార్యక్రమంలో నాలుగు ప్రధాన థిమాటిక్ ట్రాక్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఆవిష్కర్తల నుంచి దీనికి అద్భుతమైన స్పందన లభించింది.
సాంకేతిక మూల్యాంకనాలు, సొల్యూషన్ డెమాన్స్ట్రేషన్లు, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ (PoC) అభివృద్ధి, బ్యాంక్ శాండ్బాక్స్ (IDBI Innobox) పై డిప్లాయ్‌మెంట్ మరియు జ్యూరీ పరిశీలనలతో కూడిన కఠినమైన మల్టీ-స్టేజ్ మూల్యాంకన ప్రక్రియ తర్వాత, అన్ని ట్రాక్‌లలో విజేతలు, రన్నరప్‌లను ఎంపిక చేసి 2026 నవంబర్ 3 న నిర్వహించిన గ్రాండ్ ఫినాలేలో సత్కరించారు.
ఈ సందర్భంగా ఐడీబీఐ బ్యాంక్ ఎండీ & సీఈఓ రాకేష్ శర్మ మాట్లాడుతూ.. పటిష్టమైన, చురుకైన మరియు భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న బ్యాంకింగ్ సంస్థను తీర్చిదిద్దడంలో నూతన ఆవిష్కరణలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. మెరుగైన సేవలందించేందుకు పుట్టుకొస్తున్న సాంకేతికతలను అందిపుచ్చుకోవడంపై బ్యాంక్ వ్యూహాత్మకంగా దృష్టిసారించిందని ఆయన నొక్కిచెప్పారు.
కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడం, కార్యాచరణ నైపుణ్యాన్ని పెంపొందించడం మరియు అత్యున్నత స్థాయి భద్రతతో పాటు నిబంధనలను పాటిస్తూ డిజిటల్ సామర్థ్యాలను మెరుగుపరచడంపై బ్యాంక్ దృష్టి పెట్టిందని ఆయన తెలిపారు.
గ్రాండ్ ఫినాలేలో విజేత మరియు రన్నరప్ జట్లు తమ వినూత్న పరిష్కారాలను ప్రదర్శించారు. బ్యాంకింగ్ సేవల భద్రత, సామర్థ్యం మరియు అందరికీ అందుబాటులో ఉండేలా చేయడంలో ఈ నూతన పరిష్కారాలు ఎంతగానో దోహదపడతాయని ఇవి నిరూపించాయి.
ఐడీబీఐ ఇన్నోవేట్ 2026 వంటి వేదికల ద్వారా, దేశంలోని శక్తివంతమైన ఫిన్‌టెక్ ఆవిష్కరణా వ్యవస్థతో సహకరిస్తూ, అభివృద్ధి చెందుతున్న బ్యాంకింగ్, ఆర్థిక సాంకేతికతలను అంచనా వేయడంలో తన నిబద్ధతను ఐడీబీఐ బ్యాంక్ మరోసారి పునరుద్ఘాటించింది. డిజిటల్ పరివర్తనను వేగవంతం చేయడం, కస్టమర్-కేంద్రీకృత విధానాన్ని పెంపొందించడం, టెక్నాలజీ ఆధారిత ఆర్థిక సంస్థగా బ్యాంక్ స్థానాన్ని మరింత బలోపేతం చేయడం ఈ ప్రయత్నాల ప్రధాన ఉద్దేశం. (story :ఐడీబీఐ బ్యాంక్ ‘ఐడీబీఐ ఇన్నోవేట్ 2026’ గ్రాండ్ ఫినాలే విజయవంతం)

