బియ్యం విక్రయాలపై విస్తృత తనిఖీలు.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు
న్యూస్ తెలుగు/లూరు: బియ్యం విక్రయాల్లో అక్రమాలు, తూకాల్లో తేడాలు, ప్యాకేజీలపై నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలోని ex పార్వతీపురం, సాలూరు, కురుపాం, మక్కువ మండలాల్లో బియ్యం దుకాణాలు, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లలో అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి, ఐఏఎస్ పర్యవేక్షణలో జిల్లా పౌరసరఫరాల అధికారి బండి అశోక్, డీఎం బాలాజీ రామ్, లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ కె. మధు సంతోష్ కుమార్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. విజిలెన్స్ అధికారుల సమన్వయంతో కూడా తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా బియ్యం బస్తాలపై ముద్రించిన నికర బరువు, గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ), ప్యాకేజీలపై తప్పనిసరిగా ముద్రించాల్సిన వివరాలు, వినియోగదారులకు సరైన తూకంతో సరుకులు అందిస్తున్నారా అనే అంశాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
తనిఖీల్లో కొన్ని వ్యాపార సంస్థల్లో బియ్యం బస్తాల్లో తక్కువ పరిమాణంలో సరుకు ఉండటం, ప్యాకేజీలపై స్టిక్కర్లు అతికించడం, చక్కెర మరియు కందిపప్పు ప్యాకెట్లపై తప్పనిసరి వివరాలు లేకపోవడం వంటి ఉల్లంఘనలు గుర్తించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేశారు.
మొత్తం 16 వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి, 5 కేసులు నమోదు చేయగా, వాటిలో 2 కేసులు బియ్యం బస్తాల్లో తక్కువ తూకం (షార్ట్ ఫిల్లింగ్)కు సంబంధించినవి.
వినియోగదారులకు ఎలాంటి మోసం జరగకుండా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. చట్ట నిబంధనలను ఉల్లంఘించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు. (Story: బియ్యం విక్రయాలపై విస్తృత తనిఖీలు)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

