ప్రగడవరంలో టీడీపీ పాదయాత్ర
ప్రగడవరం పురోభివృద్ధే లక్ష్యం: సౌమ్యారెడ్డి
న్యూస్తెలుగు/చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని ప్రగడవరం గ్రామాన్ని అని రంగాల్లో సమగ్రమైన అభివృద్ధి సాధించడమే తమ లక్ష్యమని తెలుగుదేశం పార్టీ గ్రామపంచాయతీ అభ్యర్థి తాళ్ళూరి సౌమ్యా రెడ్డి తెలిపారు. శుక్రవారం చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో పురాతన చారిత్రక వైభవం కలిగిన అకమ్మ తల్లి ఆలయంలో పూజలు చేసి ఆమె ప్రచారానికి బయలుదేరారు. ప్రచారంలో ఆమెకు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రాజకీయాలకు అతీతంగా గ్రామాన్ని అన్ని రంగాలలో పరిపూర్ణమైన అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. ఎస్సీ బీసీ నిరుపేదల నివాస ప్రాంతాల్లో డ్రైనేజీలు,సిసిరోడ్లు ,తాగునీటి సౌకర్యం వంటి అవసరాలకు వ్యక్తిగత శ్రద్ధతో శాశ్వత ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామన్నారు. టిడిపి నాయకులు చిన్న బాబు మాట్లాడుతూ. రెండు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపి నిధులు కోటీ 50లక్షలు ఇస్తామన్నా పంచాయతీలో అధికారులు ఉన్న వేరే పార్టీ వారు పంచాయతీ తీర్మానం ఇవ్వకపోవడం గ్రామానికి నిధులు రాలేదని లేకుంటే అనేక ప్రాంతాల్లో సిసి రోడ్లు నిర్మాణం జరిగి ఉండేది అన్నారు. అందువలన అధికారులు ఉన్న పార్టీకే పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలిపించి విజయ అవకాశాలను అప్పగిస్తే అభివృద్ధి తమ లక్ష్యంగా పని చేస్తామన్నారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికే తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము తప్ప వేరే ఏ విధమైన స్వార్థ ప్రయోజనాలు లేవన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. (Story: ప్రగడవరంలో టీడీపీ పాదయాత్ర)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!


