స్మార్ట్ వాటర్ హీటర్లు, రూమ్ హీటర్లతో ఎకోలింక్(EcoLink) ఉత్పత్తుల శ్రేణిని విస్తరించిన సిగ్నిఫై(Signify)
విజయవాడ, నవంబర్ 12, 2026: ప్రపంచంలోనే లైటింగ్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన సిగ్నిఫై (యూరోనెక్స్ట్: LIGHT), భారత్‌లో తన ఎకోలింక్ ఉత్పత్తుల శ్రేణిని వాటర్ హీటర్లు, ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్ (OFR) రూమ్ హీటర్ల విభాగాలకు విస్తరించినట్లు నేడు ప్రకటించింది. వాటర్ హీటర్ల శ్రేణిలో స్టోరేజ్, ఇన్స్టంట్ వాటర్ హీటర్లు ఉన్నాయి. వీటిలో థర్మోక్వాడ్ స్మార్ట్ మోడళ్లు వైజ్ (WiZ) యాప్ అనుసంధాన సదుపాయంతో పాటు, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి షార్ట్‌కట్స్ ద్వారా వాయిస్ కమాండ్లతో నియంత్రించే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఉత్పత్తుల శ్రేణిలో వింటర్కంఫర్ట్ ఆయిల్ ఫిల్డ్ రేడియేటర్ (OFR) రూమ్ హీటర్లు కూడా ఉన్నాయి.
ఈ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో, రోజువారీ ఇంటి అవసరాలను తీర్చే రెండు గృహోపకరణాల విభాగాల్లోకి ఎకోలింక్ ఉత్పత్తుల శ్రేణిని సిగ్నిఫై విస్తరించింది. వాటర్ హీటర్ల శ్రేణిలో స్మార్ట్ నియంత్రణ సదుపాయాలతో పాటు, తుప్పు పట్టకుండా కాపాడటం, లవణాలు అధికంగా ఉండే నీరు వల్ల ఎదురయ్యే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కోవడం, వేడిని ఎక్కువసేపు నిల్వ ఉంచడం కోసం ప్రత్యేకంగా రూపొందించిన సాంకేతికతలను పొందుపరిచారు. వింటర్కంఫర్ట్ రూమ్ హీటర్లలో గదిని వెచ్చగా ఉంచేందుకు పలు హీటింగ్ మోడ్లు, అవసరానికి అనుగుణంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేసుకునే థర్మోస్టాట్ సదుపాయం ఉన్నాయి. వీటితో పాటు సూపర్ టర్బో పీటీసీ(PTC) సాంకేతికత ద్వారా తక్షణమే వేడిని అందించే సదుపాయం కూడా ఉంది.

ఈ కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై సిగ్నిఫై గ్రేటర్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ జోషి మాట్లాడుతూ, “ఎకోలింక్ను ప్రారంభించినప్పుడు, నిత్యం ఇంట్లో ఉపయోగించే గృహోపకరణాలకు ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు, నమ్మకమైన పనితీరును అందించాలన్నది మా లక్ష్యం. డిజైన్ పరంగా గుర్తింపు పొందడంతో పాటు, ఆ విభాగంలో ఇప్పటివరకు ఎవరూ చూడని సరికొత్త రూపాలను పరిచయం చేయడం ద్వారా ఎకోలింక్ ఫ్యాన్లు మా లక్ష్యాన్ని బలంగా చాటిచెప్పాయి. ఆ విజయం మా ఉత్పత్తులను మరింత విస్తరించేందుకు మాకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. కొత్త హీటింగ్ ఉత్పత్తుల శ్రేణితో వాటర్ హీటర్ల విభాగంలోనూ ఇదే ఆలోచనా విధానాన్ని అమలు చేస్తున్నాం. లవణాలు అధికంగా ఉండే నీరు వంటి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన అధునాతన సాంకేతికతను ఉపయోగించడంతో పాటు, ఉత్పత్తుల తయారీ నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. మా లక్ష్యం చాలా స్పష్టమైనది. కుటుంబాలు ఏళ్ల తరబడి నమ్మకంగా ఉపయోగించుకునే ఉత్పత్తులను అందించడంతో పాటు, భారతీయ వినియోగదారులకు సుపరిచితమైన, వారు తమదిగా భావించే బ్రాండ్‌గా ఎకోలింక్ను నిలబెట్టడం మా ఉద్దేశం.”అని తెలిపారు.
ఉత్పత్తుల శ్రేణి విస్తరణ గురించి మరింత వివరిస్తూ, సిగ్నిఫై గ్రేటర్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ విభాగం అధిపతి సి. అరుణ్ కుమార్ మాట్లాడుతూ, “ఇంటికి ఏదైనా వస్తువు కొనేటప్పుడు, అది చేసే పనిని మాత్రమే కాకుండా ఇతర అంశాలను కూడా వినియోగదారులు పరిశీలిస్తారు. అది ఎంత బాగా పనిచేస్తుంది, ఎన్నాళ్ల పాటు మన్నుతుంది, రోజువారీ వాడకానికి ఎంత సౌకర్యంగా ఉంటుంది, దాని డిజైన్ అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తుందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. ఎకోలింక్ కూడా ఇలాంటి ప్రత్యేకతలకే ప్రాధాన్యత ఇస్తుంది. వినియోగదారుల ఈ అంచనాలకు అనుగుణంగానే ఈ ఉత్పత్తుల శ్రేణిని రూపొందించాం. లవణాలు అధికంగా ఉండే నీటికి తట్టుకునేలా రూపొందించిన ట్యాంకులు, హీటింగ్ ఎలిమెంట్లతో పాటు, థర్మోక్వాడ్ స్మార్ట్‌లో యాప్ ద్వారా నియంత్రించే సదుపాయాలను కూడా అందించాం. కొత్త హీటింగ్ ఉత్పత్తుల శ్రేణితో దేశవ్యాప్తంగా మరిన్ని ఇళ్లకు ఎకోలింక్ను చేరువ చేస్తున్నాం.” అని తెలిపారు. (Story: ఎకోలింక్ ఉత్పత్తుల శ్రేణిని విస్తరించిన సిగ్నిఫై)
-
Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

