Homeవార్తలుఇన్‌సెక్టిసైడ్ మాలిక్యూల్ పియోక్సానిలిప్రోల్‌ను ఆవిష్కరించిన పిఐ ఇండస్ట్రీస్

ఇన్‌సెక్టిసైడ్ మాలిక్యూల్ పియోక్సానిలిప్రోల్‌ను ఆవిష్కరించిన పిఐ ఇండస్ట్రీస్

భారతదేశంలో మొట్టమొదటిగా దేశీయంగా కనుగొన్న ఇన్‌సెక్టిసైడ్ మాలిక్యూల్ పియోక్సానిలిప్రోల్‌ను ఆవిష్కరించిన పిఐ ఇండస్ట్రీస్

దశాబ్ద కాలపు పరిశోధనలో సాధించిన ఈ పురోగతి, ప్రపంచ స్థాయి వ్యవసాయ విజ్ఞానంలో

 స్వంత ఆవిష్కరణలను రూపొందించే భారతదేశ సామర్థ్యంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది.

 Delhi, 3 November, 2026: భారత వ్యవసాయ శాస్త్ర చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా, దశాబ్దానికి పైగా సాగిన మౌలిక పరిశోధన, నిరంతర పెట్టుబడి, శాస్త్రీయ ఆవిష్కరణల ద్వారా అభివృద్ధి చేసిన, భారతదేశ మొట్టమొదటి స్వదేశీ ఇన్ సెక్టిసైడ్ మాలిక్యూల్ పియోక్సానిలిప్రోల్‌ను పిఐ ఇండస్ట్రీస్ నేడిక్కడ ఆవిష్క రించింది.

ఈ విజయం పీఐ సంస్థకు, భారతదేశ పంటల పరిరక్షణ పరిశ్రమకు ఒక కీలక మైలురాయిగా నిలుస్తుంది. నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రారంభించడంలో, యాజమాన్య మేధో సంపత్తిని సృష్టించడంలో దేశానికి పెరుగుతున్న సామర్థ్యాన్ని పియోక్సానిలిప్రోల్ ప్రదర్శిస్తుంది.

భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా ఉంది. విస్తృత శ్రేణి పంటలు, వ్యవసాయ-వాతావరణ పరిస్థితులు, మారిపోతున్న తెగుళ్ళ ఒత్తిడిని కలిగి ఉంది. ఎని మిది దశాబ్దాలుగా పీఐ సంస్థ భారతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలతో కలిసి పని చేస్తోంది. రైతులతో తరతరాలుగా కలసి పనిచేయడం ఈ సంక్లిష్టతలపై లోతైన అవగాహనను ఏర్పరుస్తుంది.

పియోక్సానిలిప్రోల్ భారతీయ వ్యవసాయ వాస్తవాలపై ఈ అవగాహనను పీఐ అధునాతన శాస్త్రీయ ఆవి ష్కరణ సామర్థ్యాలతో మిళితం చేస్తుంది. ప్రపంచ శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయబడిన ఈ మాలిక్యూల్ భారతీయ వ్యవసాయ పరిస్థితులలో విస్తృతంగా పరీక్షించబడింది.  ఇందులో పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ట్రయల్స్, శాస్త్రీయ మదింపు, నియంత్రణపరమైన అధ్యయనాలు, ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యా లయాలతో సహా భారతదేశ వ్యవసాయ పరిశోధన పర్యావరణ వ్యవస్థ భాగస్వామ్యంతో ఉంది.

పియోక్సానిలిప్రోల్ భారత ప్రభుత్వంలోని వ్యవసాయ & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్‌సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (CIB&RC) నుండి రిజిస్ట్రేషన్ పొందింది. భారతదేశంలో కనుగొన్న మొదటి క్రిమిసంహారక క్రియాశీల పదార్ధంగా కమిటీ దీనిని అధికారికంగా గుర్తించింది.

పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వైస్ చైర్‌పర్సన్ & మేనేజింగ్ డైరెక్టర్ మయాంక్ సింఘాల్ మాట్లాడుతూ, ‘‘పదేళ్ల క్రితం, భారతదేశంలో అసలైన పంట రక్షణను కనుగొనే సామర్థ్యాన్ని నిర్మించడానికి మేం మా ప్రయాణం మొదలుపెట్టాం. అందుకు సంప్రదాయ ఆలోచనలను సవాలు చేసే ధైర్యం, గణనీయ దీర్ఘకాలిక పెట్టుబడి,  మునుపెన్నడూ సాధించని దానిని కొనసాగించాలనే దృఢ సంకల్పం అవసరమయ్యాయి. భారతీయ వ్యవ సాయంపై మాకున్న లోతైన అవగాహన ప్రపంచ స్థాయి విజ్ఞానంతో కలిసినప్పుడు ఏమి సాధ్యమో ఈ రోజు పియోక్సానిలిప్రోల్ నిరూపిస్తోంది. ఇది పీఐకి, భారతీయ వ్యవసాయ ఆవిష్కరణలకు గర్వకారణం. ఈ విజ యం, భారతదేశం నుండి ప్రపంచం కోసం అసలైన విజ్ఞానాన్ని, మేధో సంపత్తిని సృష్టించే, ఆవిష్కరణల ఆధారిత ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెనీని నిర్మించాలనే మా ఆశయాన్ని మరింత బలపరుస్తుంది’’ అని అన్నారు.

ఈ ఆవిష్కరణ, మాలిక్యులర్ డిస్కవరీ, కెమిస్ట్రీ, బయాలజీ, ఫార్ములేషన్ సైన్స్, టాక్సికాలజీ, అగ్రోనమీ, ప్రాసెస్ డెవలప్‌మెంట్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలను కలుపుకొని ఉన్న ఒక సమీకృత పరిశోధన, అభివృద్ధి పర్యావరణ వ్యవస్థలో పీఐ చేసిన దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రతిబింబిస్తుంది.

700 మందికి పైగా శాస్త్రవేత్తలు, 200 మందికి పైగా పీహెచ్‌డీ అభ్యర్థులు, 260కి పైగా పేటెంట్ల పోర్ట్‌ఫోలియోతో, పీఐ అసలైన ఆవిష్కరణలను అభివృద్ధి, వాణిజ్యీకరణ దశల గుండా ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, మౌలిక సదుపాయాలను నిర్మించింది.

పియోక్సానిలిప్రోల్ ప్రాముఖ్యత కేవలం ఒకే ఉత్పత్తికి పరిమితం కాదు. ఇది పీఐలో కెమిస్ట్రీ, బయాలజీ,  బయోకెమికల్ పరిష్కారాలను మిళితం చేసుకున్న ఒక విస్తృత ఆవిష్కరణల పరంపర మొదటి ఫలితం. ఇవన్నీ కలిసి, భారతదేశం మరింత శాస్త్రీయ స్వావలంబన దిశగా సాగిస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తాయి. ఇది స్వదేశీ పరిశోధన సామర్థ్యాలను బలోపేతం చేయడంతో పాటు, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సవాళ్లను ఎదుర్కోవడానికి భారతీయ వ్యవసాయ ఆవిష్కరణలకు అవకాశాలను సృష్టిస్తుంది.

పీఐ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ నారాయణ్ కె. శేషాద్రి మాట్లాడుతూ, ‘‘పియోక్సానిలిప్రోల్ భారత వ్యవసాయ శాస్త్ర పరిణామంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. అద్భుతమైన ఆవిష్కరణకు, శాస్త్రీయ సామర్థ్యాలు, ఓపికతో కూడిన పెట్టుబడి, దీర్ఘకాలిక నిబద్ధతతో పాటు, స్థిరపడిన సరిహద్దులకు అతీతంగా ఆలోచించే సామర్థ్యం అవసరం. పీఐ ఇండస్ట్రీస్‌కు, పియోక్సానిలిప్రోల్ తదుపరి తరం ఆవిష్కరణలకు ఒక ముఖ్యమైన పునాదిని సూచిస్తుంది. ఇది నిరంతర ఆవిష్కరణల పరంపరను నిర్మించడం, స్వదేశీ పరిశోధన సామర్థ్యాలను పెంపొందించడం, ప్రపంచ వ్యవసాయం కోసం విభిన్న సాంకేతికతలను అభివృద్ధి చేయడం పట్ల కంపెనీ నిబద్ధతను బలపరుస్తుంది’’ అని అన్నారు.

భారతదేశ మొట్టమొదటి స్వదేశీ పురుగుమందు ఆవిష్కరణ నుండి రేపటి ఆవిష్కరణల వరకు, పియో క్సానిలిప్రోల్ పీఐ, భారత వ్యవసాయ ఆవిష్కరణలకు ఒక కొత్త అధ్యాయాన్ని తెరుస్తుంది. (Story: ఇన్‌సెక్టిసైడ్ మాలిక్యూల్ పియోక్సానిలిప్రోల్‌ను ఆవిష్కరించిన పిఐ ఇండస్ట్రీస్)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments