ఐజేయూ సావనీరు బాగుంది: మంత్రి లోకేష్
న్యూస్‌తెలుగు/ఒంగోలు: ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం శుక్రవారం వచ్చిన తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను ఒంగోలులో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యుజే) ప్రతినిధులు కలిసి తమ సమస్యలను వివరించారు. లోకేష్‌ను కలిసిన సందర్భంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) 11వ ప్లీనరీ సావనీరును ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, యూనియన్ ప్రతినిధులు ఆయనకు అందజేశారు. సావనీర్‌ను లోకేష్ నిశితంగా పరిశీలించారు. ప్లీనరీ ఫోటోలను తిలకించి నాయకులను అభినందించారు. చాలా బాగా ప్లీనరీ జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ, మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, బీఎన్ విజయకుమార్, ఏలూరు సాంబశివరావు, ఇంటురీ నాగేశ్వరరావు , ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మారి టైం బోర్డ్ చైర్మన్ దామచర్ల సత్య, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి అలుగుల సురేష్, ప్రకాశం జిల్లా కార్యదర్శి కనకయ్య, ఒంగోలు నగరం ఏపియూడబ్ల్యూజే అధ్యక్షుడు కోటిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్, తదితరులు పాల్గొన్నారు. (Story: ఐజేయూ సావనీరు బాగుంది: మంత్రి లోకేష్)

Top Stories You Can See
- అందం మీ సొంతం: సహజ నిగారింపుకు 6 పోషకాలు!
- బాదం పప్పులు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
- మీరు..36 నెలల్లో లక్షాధికారి అవ్వాలా?
- వింతైన రూపం..ఈ చెట్టుకు సొంతం!
- దొంగలు పారిపోయారని జైలునే మూసేశారు!
- ఆ చేప కన్పిస్తే…సునామీనే!
- ఒకే ఆసుపత్రిలో 11 మంది స్టాఫ్ ఒకేసారి గర్భం దాల్చారు!
- నవ్వులే నవ్వులు! నయనం టీమ్‌తో బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ!
-
మల్లెపూలతో తెల్లార్లూ…!

