Homeవార్తలురాఖీ పూలు!!

రాఖీ పూలు!!

రాఖీ పూలు!!
——————-

నేలమ్మ కు
సూర్యుడు కట్టిన రాఖీ
వేకువ కదా…

లోకానికి
చంద్రుడు కట్టిన రాఖీ
వెన్నెల కదా…

పచ్చని చెట్టు సోదరికి
సోదరుడు కట్టిన ఆకుపచ్చ రాఖీ
ఒక ప్రేమనుబంధం

వానను చూస్తే
ఆకాశం లోకానికి కడుతున్న
నీటి రంగుల రాఖీల్లా…

ఈ నింగికి
హరివిల్లు రాఖీ ఎవరు కట్టారో….

ఆ అడవిని చూడండి
ఎన్ని రంగుల పక్షుల రాఖీలను
చెట్లకు కట్టిందో…

ఈ తోట కో ప్రత్యేకత వుంది
సందర్శకులను
రాఖీల పూలతో స్వాగతిస్తూ…

ఆమె రంగవల్లి దిద్దింది
పుడమి కి రంగురంగుల రాఖీలు కట్టినట్టు …
నేను పుస్తకాలకు రాఖీ కడుతూ
కార్తీక పౌర్ణిమ కవితా వెన్నెల్లో
భావనల ఊయల ఊగుతూ

** ** ***

ఏ కాలమైనా ఆకురాలు కాలమై
తెంపు లేని అమావాస్య చీకటులై
ఆమె బతుకుకు
కన్నీటి రాఖీలు కడుతూ రాజ్యం

అనుబంధాలన్నీ నిషేదాక్షరులైన సమాజంలో
రాఖీలు కట్టాల్సింది ఆమె చేతికి కాదు
ఆమె మానప్రాణాలకు …
మానవతావిలువలకు
కారణం చెప్పిన కారల్ మార్క్స్ కు

ప్రతి మనిషి ఓ సోదరుడై
ప్రకృతికి శాంతి రాఖీలు కట్టినపుడే
నిజమైన రాఖీ పున్నమి

(రాఖీ పండుగ శుభాకాంక్షలతో..)

– సరికొండ నరసింహ రాజు
9398254545

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments