Homeవార్తలుశ‌క్తివంత‌మైన పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్‌

శ‌క్తివంత‌మైన పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్‌

పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా విశ్వక్ సేన్ ‘LEGACY’  డిసెంబర్‌లో విడుదల

*మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

*మదనపల్లె పరిసర ప్రాంతాల్లో నేటి నుంచి నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా, దర్శకుడు సాయి కిరణ్ దైదా దర్శకత్వంలో కలాహీ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘LEGACY’. యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంజయ్ సాంబ్రాణి, వి.వి.ఎన్. ప్రసాద్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ‘LEGACY’ అనౌన్స్‌మెంట్ టీజర్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘పిండం’ చిత్రాన్ని నిర్మించిన కలాహీ మీడియా నుంచి వస్తున్న రెండో చిత్రం కావడంతో ‘LEGACY’పై అంచనాలు మరింత పెరిగాయి.

పవర్, ఫ్యామిలీ, ప్రేమ , ద్రోహం నేపథ్యంలో..

‘LEGACY’ ఒక ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామా. అధికారం, కుటుంబం, ప్రేమ, ద్రోహం చుట్టూ సాగే ఈ కథలో ఒక వారసుడు తాను కోరుకోని ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెడతాడు. తన తండ్రి గతానికి సంబంధించిన దాగి ఉన్న నిజాలను ఎదుర్కొంటూ, శక్తివంతమైన ప్రత్యర్థులతో పోరాడుతూ తనపై పడిన వారసత్వపు భారాన్ని మోసే పరిస్థితిని ఎదుర్కొంటాడు.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చూడని విభిన్నమైన, శక్తివంతమైన అవతార్‌లో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు కే కే మేనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.

భారీ తారాగణం.. అద్భుతమైన సాంకేతిక బృందం

ఈ చిత్రంలో ఏక్తా రాథోడ్ కథానాయికగా నటిస్తుండగా, మురళీ మోహన్ , కె కె మీనన్ , రావు రమేష్, సచిన్ ఖేడేకర్, ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, రవి కాలే, అమిత్ తివారీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ తమ అద్భుతమైన నటనతో సినిమా ప్రపంచానికి మరింత లోతు, వైవిధ్యం, శక్తిని తీసుకొస్తున్నారు.

జిజు సన్నీ ఛాయాగ్రహణం, గోవింద్ వసంత్ సంగీతం, సిరీష్ ప్రసాద్ ఎడిటింగ్, రాజీవ్ నాయర్ ప్రొడక్షన్ డిజైన్, జషువా యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

మదనపల్లెలో కీలక షెడ్యూల్

‘LEGACY’ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. నేటి నుంచి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పరిసర ప్రాంతాల్లో నెల రోజుల పాటు కీలక చిత్రీకరణ జరగనుంది. ప్రధాన తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్‌లో కథకు కీలకమైన సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్, పాటలను చిత్రీకరించనున్నారు.

భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘LEGACY’ భావోద్వేగం, ఉత్కంఠభరితమైన డ్రామా, పవర్‌ఫుల్ మ్యూజిక్, హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

అధికారాన్ని వారసత్వంగా పొందడం మాత్రమే కాదు.. ఆ వారసత్వాన్ని కొనసాగించాలా? లేక తిరగరాయాలా? అనే ప్రశ్న చుట్టూ సాగే ఈ ఆసక్తికరమైన కథ డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం & సాంకేతిక బృందం:

తారాగణం:

విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్, మురళీ మోహన్, కే కే మీనన్

రావు రమేష్, సచిన్ ఖేడేకర్, రాజా రవీంద్ర , ఖుషీ రవి, కల్యాణి నటరాజన్, రాజీవ్ కనకాల, అనీష్ కురువిల్లా, కలెక్టర్ శ్రీనివాస్, తదితరులు.

సాంకేతిక బృందం:

ఛాయాగ్రహణం: జిజు సన్నీ

కూర్పు: శిరీష్ ప్రసాద్

సంగీతం: గోవింద్ వసంత

గీత రచయితలు: అనంత శ్రీరామ్, కవి సిద్ధార్థ

కథ: సాయి కిరణ్ రెడ్డి దైదా, కవి సిద్ధార్థ

కళా దర్శకుడు: రాజీవ్ నాయర్

యాక్షన్: జాషువా

సౌండ్ డిజైన్: సింక్ సినిమా

డాల్బీ అట్మాస్: ఈ. రాధాకృష్ణ (ప్రసాద్ మిక్సింగ్ థియేటర్)

అసోసియేట్ సినిమాటోగ్రాఫర్: ఎం. శ్రీధర్

కో-డైరెక్టర్లు: మేడి కె. స్వామి, జయరమేష్

కాస్ట్యూమ్ డిజైనర్లు: పూజిత తాడికొండ, నాగ సాయి చరణ్

పిఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

పబ్లిసిటీ డిజైనర్: సుధీర్

డీఐ: B2H స్టూడియోస్

కలరిస్ట్: షణ్ముగ పాండియన్ ఎం

వీఎఫ్‌ఎక్స్: ధ్రువ్ ఎఫ్‌ఎక్స్

డిజిటల్ మార్కెటింగ్: ప్రమోట్ ఈజీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సురేష్ వర్మ వేగేశ్న

లైన్ ప్రొడ్యూసర్: శ్రీనివాస్ పెన్మచ్చ

సహ నిర్మాతలు: సంజయ్ సాంబ్రాణి, వీవీఎన్ ప్రసాద్

నిర్మాతలు: యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా

రచన & దర్శకత్వం: సాయి కిరణ్ రెడ్డి దైదా   (Story: శ‌క్తివంత‌మైన పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్‌)

Top Stories You Can See

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments