120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం
న్యూస్ తెలుగు/వినుకొండ : 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల అమ్మకాలు, వాడకంపై పూర్తి నిషేధం ఉన్నట్లు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కోడూరి శివరాం ప్రసాద్ స్పష్టం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా బుధవారం ఆయన ప్లాస్టిక్ వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ శివరామ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులకు బదులుగా పర్యావరణహితమైన క్లాత్, జ్యూట్ బ్యాగులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణ నష్టంతో పాటు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్ రహిత వినుకొండ సాధనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇందుకు వ్యాపారులు కూడా తమ పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, ఏఐఐఎల్ఎస్జీ, జిల్లా కోఆర్డినేటర్ శివపార్వతి, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, మున్సిపల్ సిబ్బంది మరియు ప్లాస్టిక్ వ్యాపారులు పాల్గొన్నారు.(Story : 120 మైక్రాన్లలోపు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం )

