Homeవార్తలుతెలంగాణచదువుకు అంగవైకల్యం అడ్డు రాదు, చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

చదువుకు అంగవైకల్యం అడ్డు రాదు, చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి.

చదువుకు అంగవైకల్యం అడ్డు రాదు, చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి

న్యూస్ తెలుగు/వనపర్తి  : డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆదేశాల మేరకు వనపర్తి జిల్లా కేంద్రంలోని భవిత సెంటర్ మరియు వికలాంగుల పునరావాస కేంద్రాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉపాధి, నైపుణ్యాభివృద్ధి మరియు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ రెండు పథకాలను అందిస్తోంది. 1.దివ్యాంగ జన రొజ్గార్ సేతు దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి దివ్యాంగులకు సరైన ఉద్యోగాలు కల్పించడం నైపుణ్యాభివృద్ధి (Skill Training) ఇవ్వడం స్వయం ఉపాధి (Self-employment) ప్రోత్సహించడం ఈ పథకాల ముఖ్య ఉద్దేశం. 2.దివ్యాంగుల స్కిల్ డెవలప్‌మెంట్ పథకం ఈ పథకం ద్వారా దివ్యాంగులకు ఉద్యోగం + ఆత్మనిర్భరత కల్పించడం ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ ఇవ్వడం ఇవ్వడం ద్వారా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు పొంది సమాజంలో ఆత్మ నూనెత భావం లేకుండా కలిసిమెలిసి సమాజంలో సమానంగా జీవించడం కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలను తీసుకోవడం జరిగింది కావున వీటిని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ ఏం రఘు, శ్రీదేవి పాల్గొన్నారు.(Story : చదువుకు అంగవైకల్యం అడ్డు రాదు, చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!