Homeవార్తలుతెలంగాణకాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం

కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం

కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం

న్యూస్ తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పార్టీ లైన్లోనే కడవరకు పని పనిచేయాలని పార్టీలైన్ తప్పకూడదని పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని RG గార్డెన్స్ లో నిర్వహించిన వనపర్తి మండల మరియు పట్టణ కమిటీ ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన DCC అధ్యక్షులు శివసేనరెడ్డి , ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి గార్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి నుంచి మరో 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుందని ప్రతిపక్షాలకు ఎలాంటి తావులేదు అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో BRS పార్టీ భూస్థాపితం అయిపోయిందని Bjp పార్టీ ఆంధ్రాలోని చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ గార్లు ఇచ్చిన సపోర్టుతో చివరి దశలో అధికారంలోకి వచ్చిందని నేడు బిజెపి పార్టీ వెంటిలేటర్ పై ఉందని అలాంటి పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరం భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చేసేంతవరకు ఉశ్రమంచకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణం కోసం గ్రామస్థాయి నుంచి పార్టీని పట్టిష్టపరిచేందుకు అధిష్టానం నేడు ప్రత్యేక చర్యలు చేపట్టిందని అందులో భాగంగానే నేడు గ్రామ కమిటీలు మండల కమిటీలు అనుబంధ సంఘాల కమిటీలను ఏర్పాటు చేస్తుందని, దీంతో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం లభిస్తోందని ఎమ్మెల్యే చెప్పారు. మున్సిపల్ చైర్మన్లుగా , వైస్ చైర్మన్గా, కౌన్సిలర్లుగా, వార్డు సభ్యులుగా, సర్పంచులుగా, ఉపసర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పిటిసిలుగా ,జడ్పీ చైర్పర్సన్లుగా, సింగిల్ విండో అధ్యక్షులుగా
మార్కెట్ యార్డ్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా, డైరెక్టర్లుగా , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనారిటీ అనుబంధ సంఘాల అధ్యక్షులుగా ,మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ,వ్యవసాయ అనుబంధ సంఘాల్లో బాధ్యులుగా, కాంగ్రెస్ పార్టీ పరమైన కమిటీలలో గ్రామ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, బూత్ అధ్యక్షులుగా, కమిటీలోని ఇతరత్రా బాధ్యత లాంటి అనేక విభాగాల్లో పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుందని ఎవరు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు. వీటితోపాటు వనపర్తి నియోజకవర్గానికి రెండు మార్కెట్ యార్డ్ లు, 7 సింగిల్ విండోలు మంజూరు చేయించి నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ బలోపే దానికి శుద్ధి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, tpcc జర్మన్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, OBC జిల్లా అధ్యక్షులు కోట్ల రవి, వనపర్తి జిల్లా యూత్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీలత రెడ్డి, ప్రధాన కార్యదర్శి తిరుపతియ్య, మైనార్టీ నాయకులు రహీం, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండల అధ్యక్షులు రవి కిరణ్, వనపర్తి పట్టణ కౌన్సిలర్లు, వనపర్తి మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story : కాంగ్రెస్ జెండా నీడలోనే కడవరకు ఉందాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!