మహిళా విద్యకై సావిత్రిబాయి పూలే పోరాటం అపూర్వం
న్యూస్ తెలుగు/వనపర్తి : సంఘసంస్కర్త సావిత్రిబాయి పూలే మహిళా బాలిక విద్య కోసం సాగించిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్ అన్నారు. మంగళవారం వనపర్తి సిపిఐ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగాచిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నిమ్న వర్గాల మహిళలు బాలికల విద్యకు నిషేధం ఉన్న కాలంలో మహారాష్ట్ర పూణేలో భర్త జ్యోతిరావు పూలే సహకారంతో 26 బాలికా పాఠశాలలను నడిపి విద్యాదానం చేశారన్నారు. దీనికి వ్యతిరేకంగా అగ్రవర్ణాలు దాడి చేసినా, అవమానించిన ఎదుర్కొని మహిళా విద్య కోసం పోరాడిన ఆమె చరిత్ర చిరకాలం గుర్తుండిపోతుందన్నారు. భర్త వద్ద చదువుకొని దేశంలో తొలి మహిళా టీచర్ గా చరిత్రకెక్కినఆమె పోరాట స్ఫూర్తితో బాలిక మహిళా విద్య కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కళావతమ్మ, దళిత కుల పోరాట సమితి జిల్లా సహాయ కార్యదర్శి శేఖర్, ఎన్ఎఫ్ఐ డబ్ల్యు పట్టణ కన్వీనర్ జయమ్మ, కో కన్వీనర్ శిరీష, సిపిఐ నేతలు లక్ష్మీనారాయణ, వంశీ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.(Story : మహిళా విద్యకై సావిత్రిబాయి పూలే పోరాటం అపూర్వం )

