మార్చి 9 వరకు గ్రామాలలో ర్యాలీలు సభలు
న్యూస్ తెలుగు/వనపర్తి : సంయుక్త కిసాన్ మోర్చా (SKM) పిలుపు వనపర్తి జిల్లా కేంద్రంలో సిపిఐ కార్యాలయంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ జక్కుల వెంకటయ్య, రైతు సంఘం జిల్లా నాయకులు పృథ్వినాదం, సిపిఐ టౌన్ కార్యదర్శి రమేష్ లు మాట్లాడుతూ ఇండియా-యూఎస్ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయొద్దు, విద్యుత్ బిల్లును తిరస్కరించాలి, విత్తన బిల్లు, నాలుగు కార్మిక కోడ్లు, వీబీజీ రామ్జీ చట్టం రద్దు, ఎంఎస్పీ సి2+50 శాతం కోసం చట్టపరమైన హామీ,రుణమాఫీ, భూసేకరణ చట్టం-2013 అమలు”*కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన అన్ని హామీల ప్రధాన డిమాండ్లు సాధించే వరకు స్వతంత్ర పోరాటాలను, అలాగే కార్మిక సంఘాలతో కలిసి ఐక్య పోరాటాలను తీవ్రతరం చేయాలనీ మార్చి 9 వరకు గ్రామలలో సభలు, సమావేశాలు జరపాలనీ మార్చ్ 10 నుండి ఏప్రిల్ 13 వరకు మండల, జిల్లా కేంద్రాలలో (సదస్సులు) మహా పంచాయతీలు నిర్వహించాలని సభలకు సమావేశాలకు జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, విద్యార్థులు, మేధావులు పాల్గొని జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో వనపర్తి ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి వంశి,ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు చిన్న కురుమన్న, శేఖర్, రాంబాబు, రైతు నాయకులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.(Story : మార్చి 9 వరకు గ్రామాలలో ర్యాలీలు సభలు )

